బ్లాగింగ్ అంటే ఏమిటి?
what is blogging in Telugu? and some popular telugu blogs.
బ్లాగింగ్ అంటే మనకు తెలిసినా సమాచారం లేక మనకి ఆశక్తి ఉన్న వాటిగురించి ఇంటర్నెట్ ద్వారా నలుగురికి తెలియజేయడం.
బ్లాగ్ అంటే ఏంటి?
What is a blog?
బ్లాగ్ అంటే ఆన్లైన్ డైరీ లేదా ఇన్ఫర్మేషన్ అందించే వేదికా, వెబ్సైటు అని చెప్తే మీకు ఇంకా బాగా అర్ధమవుతుంది.
బ్లాగ్స్ లో చాలా రకాలు ఉంటాయి. టెక్ బ్లాగ్స్, ఫోటోగ్రఫీ బ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్ ఇలా చాలా రకాల బ్లాగ్స్ మనకి ఆన్లైన్() లో ఉంటాయి.
ఐతే మన తెలుగు వాళ్ళ లో బ్లాగింగ్ చేసే వారు ఉన్నారా ? అస్సలు ఇంటర్నెట్ లో తెలుగు బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా?
ఈ ఆర్టికల్ లో మన తెలుగు బ్లాగర్స్ నిర్వహిస్తున్న కొన్ని బ్లాగ్స్ గురించి చూద్దాం.
Blogs in Telugu :
Here are some of the famous telugu blogs, Take a look to get a clear idea.
ఇంటర్నెట్ వాడకం పెరిగినా తరవాత రెండేళ్ల పిల్లవాడి నుండి పలెటూర్లో ఉన్న తాతయ్య వరకు చాలా మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.
తెలుగు లో వీడియో కంటెంట్ చేసేవారు ఎక్కువే ఉన్న బ్లాగ్స్ చేసేవారు తక్కువ. ఐతే గూగుల్ ప్రకారం తెలుగు బ్లాగ్స్ లో కంటెంట్ చూసేవారు ఎక్కువ మందే ఉన్నారు కానీ కంటెంట్ చాలా తక్కువ ఉంది.
మీరు బ్లాగింగ్ ఇంటరెస్ట్ ఉండి ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడే మీ బ్లాగ్ స్టార్ట్ చేయండి. చదవండి.
Telugu Blogs:-
ComputerEra :-
కంప్యూటర్ ఎరా (computerera.co.in) ఇది ఒక తెలుగు బ్లాగ్. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నది నల్లమోతు శ్రీధర్ గారు. టెక్నాలజీ విషయం లో ప్రజలని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉదేశ్యం తో 2001 లో ఈ బ్లాగ్ ని ప్రారంభించారు.
తెలుగు లో మొదటి టెక్నాలజీ బ్లాగ్ రాసింది శ్రీధర్ గారే. శ్రీధర్ గారు బ్లాగర్ మాత్రమే కాదు. తెలుగు లో సైబర్ సెక్యూరిటీ గైడ్ కూడా.
Tv9 లాంటి వాటిలో మొబైల్స్ ఎలా హాక్ చేస్తున్నారు అలాగే పోయిన ఫోన్ ని ట్రాక్ చేయడం లాంటి వాటి మీద తెలుగు టీవీ మీడియా లో మీకు కనిపించే ఉంటారు.
తెలుగు టెక్ న్యూస్, గాడ్జెట్స్, గైడ్ ఇలాంటి టాపిక్స్ మీద డైలీ ఆర్టికల్స్ రాస్తుంటారు.
మన తెలుగు లో లేటెస్ట్ టెక్ న్యూస్, కొన్ని ఇంటరెస్టింగ్ గాడ్జెట్స్ న్యూస్, అలాగే కంప్యూటర్ ట్రిక్స్ ఇలాంటివి చదివేవారికి ఈ బ్లాగ్ బాగా నచుతుంది.
Smarttelugu :-
స్మార్ట్ తెలుగు(smarttelugu.com) పేరులోనే ఉంది మన తెలుగు పదం. ఇది కూడా ఒక తెలుగు బ్లాగ్. ఇది నిర్వహిస్తున్నది రవి కిరణ్ కొంగంటి గారు.
తెలుగు లో బ్లాగింగ్, స్టార్టుప్ , బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ స్మార్ట్ తెలుగు బ్లాగ్ లో కనిపిస్తుంది.
ఎక్కువ కేసు స్టడీస్ తో, ప్రాక్టికల్ గా కంటెంట్ ఎక్సప్లైన్ చేయడం లో స్మార్ట్ తెలుగు ఎప్పుడు ముందుంటుంది.
డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఒక బిజినెస్ ఆన్లైన్ కి ఎలా తీసుకుని రావాలి. ఆన్లైన్ బిజినెస్ గైడ్ లాంటివి మన స్మార్ట్ తెలుగు ముఖ్య ఆలోచనలు.
Digitalbadi :-
digitalbadi.com , పేరు కొంచెం మన bloggingbadi కి దగ్గర గా ఉంది అనిపిస్తుంది కదా. ఈ బ్లాగ్ రన్ చేస్తుంది జాన్ గారు. తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ గురించి వివరంగా digitalbadi లో ఉంటుంది.
ఈ మధ్య కాలం లో డిజిటల్ మార్కెటింగ్ గురించి మన ఎక్కువగా విన్నటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అని చెప్పి వాళ్ళ కి వచ్చి రానీ సోది చెప్పడం ఎక్కువ అయ్యింది.
మళ్ళీ దానికి వేలు పెట్టి కొనడం. ఐతే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ?
మన తెలుగు లో అందరికి అర్ధవంతం గా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్రీ కోర్స్ జాన్ గారు లాంచ్ చేసారు.
మీకు ఇంటరెస్ట్ ఉంటే చూసి, ఫ్రీ గా నేర్చుకోండి.
Note:- తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మన ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. దయచేసి మీ డబ్బును వృధా చేసుకోకండి. Smarttelugu , DigitalBadi ఈ రెండు బ్లాగ్ లో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఇస్తున్నారు.
Lekhini:-
లేఖిని – ఆన్లైన్ లో తెలుగు కోసం! ఇది వాళ్ళ tagline. లేఖిని ఒక తెలుగు టైపింగ్ బ్లాగ్. ఇప్పుడు ఐతే మనకి చాలా తెలుగు టైపింగ్ సైట్స్ వచ్చాయి కానీ, మొదటి నుంచి తెలుగు టైపింగ్ కోసం ఉన్న సైట్ మన లేఖిని.
ఉండటానికి ఎప్పటినుండో ఉన్న, ఇప్పుడు మనకి కావలసిన అవసరం ఈ లేఖిని లో లేదు. ఇప్పుడు మనం ఎక్కువ రాస్తున్న Tenglish(Telugu-English). దానినుంచి తెలుగు లో కి మార్చుకుంటున్నాం.
ఐతే ఈ టూల్స్ లో ప్రస్తుతం Tenglish సరిగ్గా పని చేయట్లేదు. కానీ ఎలా టైపు చెయ్యాలో మీకు డిటైల్డ్ గైడ్ పక్కనే ఉన్న ఛార్ట్స్ లో ఉంటుంది.
9Lessons:-
9Lessons ఈ బ్లాగ్ ప్రోగ్రామింగ్ కి సంబంధించిన బ్లాగ్. ప్రోగ్రామింగ్ కి ఉన్న చాలా పాపులర్ బ్లాగ్స్ వదిలేసి 9Lessons గురించి ఎందుకు రాస్తున్న అంటే, ఈ బ్లాగ్ రాస్తున్నది మన తెలుగు వ్యక్తి.
అవును, శ్రీకాకుళానికి చెందినా srinivas tamada గారు. తనకి ఇంటరెస్ట్ ఉన్న ప్రోగ్రామింగ్ మీద బ్లాగ్ ఎందుకు రాయకూడదు అనే ఆలోచన నుంచే ఈ blog వచ్చింది.
Chamatkaram:-
చమత్కారం, ఇది తెలుగు కామెడీ బ్లాగ్. మన బిజీ బిజీ ప్రపంచంలో అందరిని నవ్వించడానికి
మనకు రోజు జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలను కార్టూన్ రూపం లో చేసి ఈ బ్లాగ్ లో పెడతారు.
కార్టూన్స్,జోక్స్, హాస్య తెపించే కంటెంట్ చమత్కారం బ్లాగ్ లో ఉంటుంది. మీకు కాళీ సమయం ఉంటే ఒకసారి చెక్ చేయండి. కానీ కాస్త ప్రశాంతం గా నవ్వుకోవచ్చు.
SailusFood :-
శైలూస్ ఫుడ్,ఈ బ్లాగ్ క్రియేటర్ వచ్చేసి శైలజ గుడివాడ గారు. పేరులోనే అర్ధమవుతుంది ఇది ఒక ఫుడ్ & రెసిపీస్ బ్లాగ్ అని. మన అందరికి తెలిసిన విషయమే, మంచి ఆహారం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరి అలాంటి ఆహారం గురించి మనం ఎందుకు రాయకూడదు అనే ఆలోచన నుంచి వచ్చింది ఈ శైలూస్ ఫుడ్.
ఈ బ్లాగ్ లో మీకు ఎక్కువ breakfast , లంచ్, స్నాక్స్ , ఫెస్టివల్స్, అలాగే మన తెలుగు వారి వంటలు కనిపిస్తూ ఉంటాయి. చాలా కొత్త కొత్త వాంటకాలు ట్రై చేస్తూ, వాటిని అందరికి తెలియ చేస్తారు.
మీకు వంటల ఆసక్తి ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మీకు తప్పకుండా నచుతుంది. This is one of my favorite Telugu blogs.
Alltechbuzz :-
అల్ టెక్ బజ్ (AllTechBuzz), ఎక్కువ మంది ఈ సైట్ గురించి విన్నది ఈటీవీ యువ ప్రోగ్రాం వల్ల, అవును నేను కూడా అలా విన్నవాడినే.
2014 లో ఈటీవీ వారు టెలికాస్ట్ చేసిన యువ ప్రోగ్రాం లో ఒక యువకుడు నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పగానే చాలా మంది బ్లాగింగ్ వైపు చూడడం మొదలు పెట్టారు.
ఈ బ్లాగ్ లో ఆండ్రాయిడ్, గాడ్జెట్స్,యాప్స్ మరియు బ్లాగింగ్ కి సంభందించిన కంటెంట్ కనిపిస్తుంది. కానీ బ్లాగ్ కంటెంట్ మన తెలుగు లో కాకుండా ఉంటుంది. మీ ఇలాంటి కంటెంట్ తెలుగు లో కావాలి అంటే computerera చూడండి.
తరవాతి ఆర్టికల్ లో ఈ బ్లాగ్ క్రియేటర్స్ గురించి వివరిస్తాను.
Good article bro.. inspiration article especially smart Telugu.
Very Nice Bro