BloggingBadi – Kranthi Kumar
నా గురించి…?
పేరు :- మండా క్రాంతి కుమార్
ఊరు :- కేశవరం
వృత్తి :- స్టూడెంట్ (Btech under Programming)
ఇంట్రెస్ట్ :- blogging & digital marketing
BloggingBadi ఎందుకు, ఎలా స్టార్ట్ చేశా?
ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఏది తెలుసుకోవాలన్న గూగుల్ వెతకడం అలవాటుగా మారింది. ఐతే మరి మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిన భాషలో దొరుకుతుందా?
మనం రోజు గూగుల్ లో సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ & మనకి వచ్చే సెర్చ్ రిజల్ట్స్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటున్నాయి. మన తెలుగువాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ రాక, గూగుల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థంకాక వాటిని ఇలానే వదిలేస్తున్నారు.
ఐతే మరి మనకి ఇంటర్నెట్ లో మన తెలుగు భాషలో ఇన్ఫర్మేషన్ దొరకదా?
తెలుగు లో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, మన మాతృభాషలో ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు ఉండాలి.
అందుకనే తెలుగు లో బ్లాగింగ్ & డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకున్నది మరియు నేర్చుకుంటున్నది మీతో పంచుకోవాలి అనే ఉదేశంతోనే bloggingbadi ని రూపొందించాను.
బ్లాగింగ్ అంటే ఒక బ్లాగ్ క్రియేట్ చేసి మస్తుగా డబ్బులు సంపాదించడం అనుకుంటే పొరపాటు, బ్లాగింగ్ కోసం మన సొంత డబ్బు చాలానే పెట్టాలి, ఎంత డబ్బు పెట్టిన కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు.
నేను బ్లాగింగ్ ని డబ్బు సంపాదించడానికి క్రియేట్ చేయలేదు అంటే నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకు అంటే ఈరోజుల్లో డబ్బుకోసం కాకుండా దేనికోసం చేస్తారు అని అడుగుతారు . ఐతే నేను bloggingbadi స్టార్ట్ చేసింది, ఒక blogger & Digital marketer గా మారాలి అనే ఉదేశంతో మాత్రమే.
personal life :-
హాబీలు:- కాళీ దొరికితే సోషల్ మీడియా లో ఉండటమే నా పని. ఇప్పుడిపుడే పుస్తకాలు చదవడం మొదలు పెడుతున్న.
బాగా నచ్చిన పని:- మార్కెట్లోకి వచ్చిన ప్రతి మొబైల్ గురించే తెలుసుకోవడం, రోజు technews ఫాలో అవ్వడం. కొత్త కొత్త గాడ్జెట్స్ గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం.
ఖాళీ సమయాల్లో :- కొంచెం ఖాళీ దొరికిన సోషల్ మీడియా లేదా బ్లాగ్స్ చదువుతుంటాను.
బ్లాగింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్కువ వెతుకుతూ తెలుసుకుంటుంటా.