బ్లాగ్ మరియు వెబ్‌సైట్‌ను freeగా ఎలా క్రియేట్ చేయాలి?
Create free blog in telugu :
వెబ్‌సైట్‌ను ఎలా క్రియేట్ చేయాలి లేదా బ్లాగ్ ఎలా తయారు చేయాలి ? మీరు ఇంటర్నెట్ నుండి డబ్బు సంపాదించడం గురించి విన్న లేదా తెలిసి ఉంటే , మీరు బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని మీకు తెలిసే ఉంటది.
నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ అత్యంత ముఖ్యమైనది. ఆన్‌లైన్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన విషయం వెబ్‌సైట్లు మరియు బ్లాగులు. మీకు ఏదైనా సమాచారం అవసరమైతే లేదా ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలంటే, మీరు ఆలోచించకుండా గూగుల్‌లో search చేస్తారు.
అక్కడ మీకు చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఇంటర్నెట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు అనిపిస్తుంది కొన్నిసార్లు.
గూగుల్‌లో వెతకడం ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గూగుల్ మీ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? కచ్చితంగా కాదు, ఈ సమాచారం అంతా మీకు వేరువేరు వెబ్‌సైట్‌లను మరియు బ్లాగుల నుండి ఇస్తుంది.
గూగుల్ యొక్క పని ఏమిటంటే, ఆ వెబ్‌సైట్ మరియు బ్లాగ్ యొక్క లింక్‌లను దాని డేటాబేస్లోలో స్టోర్ చేసుకుని దానిని సెర్చ్ రిజల్ట్స్ గా చూపిస్తుంది.
వెబ్‌సైట్ అంటే ఏమిటి?
వెబ్‌సైట్‌ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకునే ముందు , వెబ్‌సైట్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం? వెబ్‌సైట్ మరియు బ్లాగ్ మధ్య తేడా ఏమిటి? మనం వెబ్‌సైట్ గురించి మాట్లాడినప్పుడు, ఒక సంస్థ అనే ఫీలింగ్ వస్తుంది.
ఉదాహరణకి ఫేస్బుక్ తీస్కుందాం, ఇది ఒక సంస్థ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్. దీని ద్వారా మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్‌లో చాట్ చేయవచ్చు మరియు మీ ఫోటోలు మరియు వీడియోలను పంచుకోవచ్చు. అదే విధంగా, గూగుల్ కూడా ఒక వెబ్‌సైట్, ఇది మనకి సెర్చ్ రిజల్ట్స్ అందిస్తుంది.
ఇప్పుడు బ్లాగ్ గురించి చూదాం, బ్లాగ్ అంటే వెబ్సైటు లో ఒక పార్ట్ అని అనుకోవచ్చు.
ఉదాహరణకి smarttelugu తీస్కోండి, smarttelugu ఒక వెబ్సైటు. ఆ వెబ్సైటు లో బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటది. ఇంకా చెప్పాలి అంటే బ్లాగ్ లో రెగ్యులర్ ఆర్టికల్స్ వస్తుంటాయి. TeluguBadi (తెలుగుబడి) అనేది ఒక బ్లాగ్ అన్నమాట.
ఉచితంగా వెబ్‌సైట్‌ను ఎలా చేయాలి? [Create a free telugu blog]
వెబ్‌సైట్‌ను బిల్డ్ చేయడానికి చాలా విషయాలు అవసరం మరియు మొదట డబ్బు (ఖర్చు) గురించి తెలుసుకోవడం ముఖ్యం, తరువాత హోస్టింగ్ మరియు చివరగా వెబ్ డిజైనింగ్ (HTML, CSS, జావాస్క్రిప్ట్ , PHP) మొదలైనవి.
మీకు డబ్బు ఉంటే, మీరు ఈ పనిని వెబ్ డెవలపర్‌కు ఇవ్వవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా, వారు మీ వెబ్‌సైట్‌ను డిజైన్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దీని కోసం మీరు చాలా డబ్బు పెట్టుబడి పెట్టాలి.
మీరు వెబ్‌సైట్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీరు కూడా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఆన్‌లైన్లో (ప్లాట్‌ఫారమ్) సైట్ బిల్డర్ అందించే కొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి, దీని ద్వారా మీరు కోడింగ్‌తో పని లేకుండా మీ వెబ్‌సైట్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఉదాహరణకి www.wix.com (యూట్యూబ్ లో యాడ్స్ తో అందరికి బాగా పరిచయం అయ్యారు).
ఐయినా ఇప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా చాలా themes మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి (దీని గురించి వేరే ఆర్టికల్ లో వివరంగా రాస్తాను).
బ్లాగ్ అంటే ఏమిటి? [blog meaning in telugu]
బ్లాగ్ యొక్క కాన్సెప్ట్ వెబ్సైటుకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీకు కొన్ని ఉత్పత్తులను తయారుచేసే సంస్థ ఉందని అనుకుందాం. మీరు దాని కోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా తయ్యారు చేసారు. కానీ బ్లాగ్ ద్వారా మీ ఉత్పత్తులను బయటి ప్రపంచంలో ప్రమోట్ చేయడానికి సహాయపడుతుంది.
ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే బ్లాగ్ లో మన భావాలను, మనకు నచ్చిన వాటి గురించి ఈ ప్రపంచంతో పంచుకుంటాం.
ఉచితంగా బ్లాగును ఎలా క్రియేట్ చేయాలి?
ఫ్రీ బ్లాగ్ అంటే మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలనుకుంటే, మొదట మీరు ఉచితంగా ప్రారంభించాలి. మీరు దాని గురించి తెలుసుకుని, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నప్పుడు, మీరు దానిలో పెట్టుబడి పెట్టడం మంచిది.
ఫ్రీగా బ్లాగ్ క్రియేట్ చేయడానికి రెండు పాపులర్ ప్లాటుఫార్మ్స్ ఉన్నాయి.
బ్లాగర్ మరియు WordPress.
Blogger లో ఫ్రీగా బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి?
బ్లాగర్ (బ్లాగ్‌స్పాట్) గూగుల్ యొక్క ఫ్రీ బ్లాగింగ్ ప్లాట్ఫారం.కాబట్టి అందులో మీరు అకౌంట్ క్రియేట్ చేయనవసరం లేదు. మీకు Google అకౌంట్ ఉంటే, మీరు దాన్ని యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి స్టెప్ బై స్టెప్ చూదాం.
1. మీ కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి www.blogger.com లేదా www.blogspot.com కు వెళ్లండి.
2. ఇక్కడ మీరు మీ Gmail ID మరియు పాస్‌వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ అవ్వండి. మీరు ఇప్పటికే గూగుల్‌లోకి లాగిన్ అయి ఉంటే, అదే మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది.
3. లాగిన్ అయిన తరువాత, అక్కడ మీకు ఎడమ వైపున ” New Blog” అనే బటన్‌ను కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి
4. మీ బ్రౌజర్‌లో క్రొత్త పాపప్ విండో ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీరు మీ క్రొత్త బ్లాగ్ వివరాలను ఎంటర్ చేయాలి.
5. ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసిన తరువాత, ” Create బ్లాగ్ ” బటన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ బ్లాగ్ సిద్ధంగా ఉంది. బ్లాగ్ అడ్రస్ ఫీల్డ్‌లో మీరు ఏ పేరు పెడితే, అది మీ బ్లాగ్ అడ్రస్.
ఉదాహరణకి mandakranthikumar.blogspot.com . బ్లాగర్ ఈ బ్లాగ్ ఫ్రీగా ఇస్తుంది కాబ్బటి ఇది సబ్-డొమైన్‌తో వస్తుంది. అదే blogspot.com , ఇలా ఫ్రీగా బ్లాగ్ క్రియేట్ చేయడం చాలా సులభం.
WordPress లో ఉచితంగా బ్లాగ్ / వెబ్‌సైట్‌ను ఎలా క్రియేట్ చేయాలి?
బ్లాగర్ లో లాగానే వర్డుప్రెస్సు లో కూడా బ్లాగును క్రియేట్ చేయడం చాలా సులభం.
1. మీ కంప్యూటర్ లేదా మొబైల్లో www.wordpress.com వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. అక్కడ మీకు “Start Your Website” ఆప్షన్ వస్తుంది, దానిని క్లిక్ చేయండి.
3. తరువాతి పేజీలో మీ డీటైల్స్ (Email, username, password) ఇచ్చి create your account పైన క్లిక్ చేయండి.
4. తరువాతి పేజీలో, మీకు కొన్ని ఒప్షన్స్ కనిపిస్తాయి, మీరు ” Blog ” ఎంచుకోండి. తరువాత బ్లాగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది.
5. అప్పుడు మీరు ఒక థీమ్‌ను ఎంచుకోవాలి, అది మీ బ్లాగ్ డిజైన్ అవుతుంది.
6. తరువాతి పేజీలో, మీరు మీ బ్లాగ్ కోసం డొమైన్ పేరును ఎంచుకోవాలి.
బ్లాగ్ నేమ్ ఎంటర్ చేసి “Start విత్ ఆ ఫ్రీ సైట్ ” క్లిక్ చేయాలి.
మీ wordpress బ్లాగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆర్టికల్స్ రాయడం.
ఫ్రీగా బ్లాగ్ ఐతే క్రియేట్ అయిపోయింది. కానీ, అసలు సమస్య ఇక్కడే ఉంది. మీరు క్రియేట్ చేసిన బ్లాగ్ ని మీరు కస్టమైజ్ చేయలేరు (ఇది ఫ్రీ ప్లాట్ఫారం కనుక).
మీకు కొంచెం నౌలెడ్జి మరియు ఎక్స్పీరియన్స్ వచ్చాక, డొమైన్ మరియు హోస్టింగ్ తీసుకుని బ్లాగింగ్ స్టార్ట్ చేయచ్చు.
Create a Telugu blog – Step by step guide to Telugu blogging.
Tq
Amazing information…/it is usuful content for startup persons