”Digital Marketing in Telugu” గురించి చూదాం.డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా బ్రాండ్ లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఉపయోగించే మార్కెటింగ్.డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మార్కెటింగ్ టెక్నిక్స్ కలగలిపిన ఒక మార్కెటింగ్.
Digital Marketing in Telugu:
డిజిటల్ మార్కెటింగ్ ఎవరికీ ఉపయోగపడుతుంది?
ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అమ్మాలి అనుకునేవారికి లేదా తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలి అనిచూసేవారికి ఈ డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ రోజు ప్రతి డిజిటల్ ప్లాటుఫామ్ లో యాడ్స్ డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా లో యాడ్స్ ద్వారా మనకి కావలసిన యూజర్స్ ని టార్గెట్ చేసే వీలుంటుంది.
డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు?
ఇది ఎవరైనా చేయవచ్చు. విద్యార్థులు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, వారు దీనిని కెరీర్ గా తీసుకోవచ్చు. మీరు ఇప్పటికే ఒక కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటే దీనిని పార్ట్టైమ్ గా కూడా చేయొచ్చు.
అస్సలు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎంఎం ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే క్యాటగిరీస్:
- సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్
- సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్
- సోషల్ మీడియా మార్కెటింగ్
- కంటెంట్ మార్కెటింగ్
- ఇమెయిల్ మార్కెటింగ్
- ఎఫిలియేట్ మార్కెటింగ్
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్:
మనం రోజు గూగుల్ లో చాలా వెతుకుతుంటాం, ఐతే 99% మంది గూగుల్ లో వచ్చే ఫస్ట్ పేజీ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. ఈ ఆర్టికల్ చదువుతున్న మీరు మరియు నేను కూడా ఈ కోవకి చెందినవారిమే.
seo అంటే మన బ్లాగ్ లేదా వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ఫస్ట్ పేజీలో రాంక్ అవ్వడానికి ఉపయోగించే ప్రక్రియ.
ఒక బ్లాగ్ కి seo చేయడం అనేది మనం అనుకున్నంత తేలికకాదు. దానికి చాలా సమయం పడుతుంది, ఒకొక్కసారి మనం రాసిన పోస్ట్ రాంక్ అవ్వడానికి సంవత్సరాలు టైం తీసుకుంటుంది కూడా. దీనిబట్టి మీకు అర్థమైవుంటది SEO చేయటానికి చాలా సహనం ఉండాలి.
డిజిటల్ మార్కెటింగ్ లో seo ఎలా ఉపయోగపడుతుంది?
కంపెనీస్ తమతమ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి సెర్చ్ రిజల్ట్స్ ముందు వరసలో రావాలి అని చూస్తాయి, మరి అలా రావాలి అంటే కచ్చితంగా ఈ SEO ఉపయోగించితీరాలి. మనం ప్రొడక్ట్స్ గురించి వెతికే సమయంలో, గూగుల్ లో వచ్చిన ఫస్ట్ పేజీ రిజల్ట్స్ మాత్రమే కాన్పిడెర్ చేస్తాం కదా. కాబ్బటి డిజిటల్ మార్కెటింగ్ లో SEO ఎంత అవసరమో ఈపాటికే మీకు అర్థమైవుంటది.
SEO గురించి పూర్తీ వివరంగా ఇంకొక ఆర్టికల్ లో రాస్తాను.
సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్:
సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీ (SERP) పై కనిపించే పెయిడ్ యాడ్స్ ను ఉపయోగించి ఒక బిజినెస్ ని మార్కెటింగ్ చేసే విధానం. దీనినే పైడ్ సెర్చ్ మార్కెటింగ్ అనికూడా అంటారు.
ఈ పెరుగుతున్న పోటీ మార్కెట్ లో మీ బిజినెస్ పెంచుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో SEM ఒకటి.
సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో ప్రధాన పాత్ర పోసించేది కీవర్డ్స్.
యూజర్స్ ఉతుకుతున్న కీవర్డ్స్ కనిపెట్టి, తమకి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ సెర్చ్ రిజల్ట్స్ లో యాడ్స్ డిస్ప్లే చేస్తారు.
సోషల్ మీడియా మార్కెటింగ్:
సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక విధమైన ఇంటర్నెట్ మార్కెటింగ్. సోషల్ మీడియా అనగానే మనకి గుర్తొచ్చేది ఫేస్బుక్, ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ మరియు Linked In.
మనం రోజు టైంపాస్ చేయడనికి ఉపయోగించే సోషల్ మీడియాని సరిగ్గా వాడుకుంటే బిజినెస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది.
ఐతే చాలా మందికి సోషల్ మీడియాని బిజినెస్ కోసం ఎలా వాడుకోవాలో తెలీదు.
మనం తరచుగా వాడే ఫేస్బుక్ లో కొన్ని పోస్ట్స్ కిందా sponsored అని వస్తాయి వాటినే ఫేస్బుక్ స్పాన్సేర్డ్ పోస్ట్స్ (యాడ్స్ ) అని అంటారు.
క్రియేటివ్ గా యాడ్స్ డిజైన్ చేసి పబ్లిష్ చేస్తే మన బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ ఈ సోషల్ మీడియా ద్వారా పొందొచ్చు.
ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మరియు లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాటుఫామ్స్ లో కూడా ఈ యాడ్స్ రన్ చేసే వీలుంది. ఈ రోజులో ఎక్కువమంది తమ సమయాన్ని సోషల్ మీడియా గడపడానికి చూస్తున్నారు, కాబ్బటి సోషల్ మీడియా ని ఉపగయోగించి మన ప్రోడక్ట్ సేల్స్ లేదా బ్లాగ్ ఆడియన్స్ పెంచుకోవచ్చు.
కంటెంట్ మార్కెటింగ్:
“కంటెంట్ ఇస్ కింగ్ ” అని మీరు ఎప్పుడైనా విన్నారా?
బ్లాగింగ్ గురించి మీరు కొద్దిపాటి రీసెర్చ్ చేసిన వారైతే మీరు ఈ సెంటెన్స్ ఇప్పటికే
విని ఉంటారు.
కంటెంట్ మార్కెటింగ్ అంటే వివిధ రూపాల్లో ఆకర్షణీయ(ఎట్ట్రాక్టీవ్) కంటెంట్ క్రియేట్ చేయడం. ఉదాహరణకి బ్లాగ్స్ ,వీడియోస్,ట్విట్స్, సోషల్ మీడియా పోస్ట్స్.
కంటెంట్ మార్కెటింగ్ అనేది ఒక లాంగ్-టర్మ్ స్ట్రాటజీ, మనం రెగ్యులర్ గా క్వాలిటీ కంటెంట్ అందించడం ద్వారా మనకి మన ఆడియన్స్ కి మధ్య స్ట్రాంగ్ రియాల్టిన్ ఏర్పడేలా చేస్తుంది.
ఎవరైనా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సెల్ల్ చేయాలి అంటే వాళ్ళురాసిన కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్లాగ్ కి వచ్చిన విజిటర్స్ కి మనం రాసిన కంటెంట్ నచ్చితే డైలీ మన వెబ్సైట్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
మీకు ఇప్పటివరకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఈ ఆర్టికల్ చదవండి.
ఆన్లైన్ లో ఒక అమ్మకం జరగాలి అంటే, కొనే వ్యక్తికి మనమీద నమ్మకం ఉండాలి.
దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు కంటెంట్ అనేది ఎంత అవసరమో.
కంటెంట్ చాల రకాలుగా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు,మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి ?
మీరు మీ ఆడియన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, మీ కంటెంట్ వాళ్ళని కొంచమైనా మోటివేట్ మరియు ఇంప్రెస్స్ చేసేలా ఉండాలి.బ్లాగింగ్ లో ఎక్కువ మంది చేసే తప్పు కంటెంట్ స్ట్రాటజీ లేకుండా ఉండటం.
మీరు టార్గెట్ చేయాలి అనుకునే ఆడియన్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. మీరు ఏ విధంగా కంటెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో ఆలోచించండి. కంటెంట్ అంటే ఏదోకటి రాసేయడం కాదు మిత్రమా! యూసర్ ప్రాబ్లెమ్ కి ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా మన కంటెంట్ ఉండాలి.
ఒకొక్క బిజినెస్ కి ఒకో కంటెంట్ స్ట్రాటజీ ఉంటది. మీ కస్టమర్లు మరియు ఆడియెన్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థంచేసుకున్న తరువాత, వారి సమస్యలను పరిష్కరించే కంటెంట్ ని మీరు సులభంగా సృష్టించవచ్చు.ఈ కంటెంట్ మార్కెటింగ్ గురించి మరింత వివరంగా వేరే ఆర్టికల్ లో రాస్తాను.
ఇమెయిల్ మార్కెటింగ్:
అస్సలు ఇమెయిల్ మార్కెటింగ్ ఎందుకు?
ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఇమెయిల్ ద్వారా ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకునే ప్రక్రియ.
మీరు ఇప్పటికే వివిధ వెబ్సైట్స్ లో న్యూస్లెటర్స్ కోసం మీ యొక్క ఇమెయిల్ ఇచ్చి ఉంటారు.
ఈ ఇమెయిల్ ద్వారా మార్కెటింగ్ చేయాలి అంటే మనకి ముందుగా మనల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ ఉండాలి మరియు వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ కూడా మన లిస్ట్ లో ఉండాలి.
అస్సలు యూజర్స్ మనకి ఇమెయిల్ ఎందుకు ఇస్తారు?
మన టార్గెటెడ్ ఆడియన్స్ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి ఇదొక విధంగా ఉపయోగపడాలి. ఉదాహరణకి Ebooks,వీడియో కోర్స్ ఇంకేదైనా ప్రీమియం కంటెంట్ ఇవ్వడంలాంటివి.
బ్లాగింగ్ ఇండస్ట్రీలో పెద్ద నుండి చిన్న చిన్న బ్లాగర్స్ దాకా అందరు ఇమెయిల్ మార్కెటింగ్ ఉస్ చేస్తారు.
దీనితో ఉన్న పెద్ద ఎడ్వాంటేజ్ వచ్చేసి ROI (రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్).
మార్కెటింగ్ లెక్కల ప్రకారం మనం పెట్టె ఒకో డాలర్ కి 43 డాలర్స్ రిటర్న్ వస్తుంది.
43 డాలర్స్ అనగానే సంతోషపడకండి, అలా రావాలి అంటే మన బ్లాగ్ ఒక సక్సెసఫుల్ మార్గంలో ఉండాలి.
ఈ emails తో మీకు మీ customers ప్రొఫెషనల్ గా కనెక్ట్ అవుతారు.
మన టార్గెటెడ్ ఆడియన్స్ ని సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వుతున్నాం కదా! మరి ఇంకా ఈ ఇమెయిల్ మార్కెటింగ్ అవసరమా? ఈ ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటది.
సోషల్ మీడియా లో చాలా మంది టైంపాస్ కోసం లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టె పోస్ట్స్ లేదా అప్డేట్స్ చూడటానికి వస్తారు. ఐతే మనం సోషల్ మీడియా లో మాత్రమే ప్రమోట్ చేసి ఉరుకుంటే మాత్రం రీచ్ అనేది చాలా తక్కువ ఉంటది.
ఇమెయిల్ మార్కెటింగ్ వాళ్ళ మేజర్ ఎడ్వాంటేజీ అదే, కొత్త కంటెంట్ రాసిన ప్రతిసారి ఇమెయిల్ లిస్టులో ఉన్న మెంబెర్స్ కి పంపించడం ద్వారా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటది.
ఎఫిలియేట్ మార్కెటింగ్:
ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇతరుల ప్రొడక్ట్స్ లేదా ఏదైనా కంపెనీ ప్రొడక్ట్స్ ఇతరులకు రిఫర్ చేస్తూ వాటితో కొంత కమిషన్ సంపాదించే మార్గం.
చాలా మంది బ్లాగర్లు మరియు యూటుబ్ర్స్ ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ను ఉపయోగిస్తారు.
ఎఫిలియేట్ మార్కెటింగ్ లో కమిషన్ ఎలా వస్తుంది?
మనలో చాలామంది టెక్ యూటుబ్ర్స్ ని ఫాలో అవుతుంటాం. వల్లనే ఒక ఉదాహరణగా తీసుకుని చూదాం.
గాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్, లేటెస్ట్ లాప్టాప్ రివ్యూస్ ఇలా వాళ్ళు చేసే ప్రతి వీడియో కింద ఎఫిలియేట్ లింక్ ఇచ్చి, మనల్ని ఆ లింక్ ద్వారా మొబైల్స్ కొనండి అంటుంటారు. దీనినే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. వాళ్ళు మనకి ఒక ప్రోడక్ట్ రెఫెర్ చేస్తుంటే మనం కొంటున్నాం.
రిఫెరల్ కమిషన్ ఎలా వస్తుంది?
అమెజాన్,ఫిల్ప్కార్ట్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ముందే ప్రతి ప్రోడక్ట్ మీద కమిషన్ రేట్స్ ఫిక్స్ చేసి ఉంచుతాయి.
మొబైల్స్ మీద 1% అని, Kindle Devices & eBooks 10% , Health & Personal Care 8%, ఇలా ఇంత రేట్స్ అని ఉంటాయి.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికీ మంచి వెబ్సైట్
Hi Kranthi,
i am interested to start blogging on Finance and accounting out of some passion as i am into core accounting and finance working for an MNC in hyd. However form 2022, what could be the scope to make it as successful and profitable business? as i am keep on hearing the words like blogging is on pick stage now do not see much scope in coming years?