Domain in Telugu:-
డొమైన్ నేమ్ అంటే ఏమిటి? మనమందరం ఇంటర్నెట్ లో మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం వెతికే ఉంటాం. ఐతే మనకి సమాచారం అందించే బ్లాగ్స్ లేదా వెబ్సైటు కి ఉన్న అడ్రస్ ని డొమైన్ అంటాం.
ఉదాహరణకి గూగుల్ (google.co.in),బింగ్ (bing.com),యాహు (yahoo.com), స్మార్ట్ తెలుగు (smarttelugu.com), తెలుగుబడి (telugubadi.in).
ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ బ్లాగ్ అడ్రస్ అనేది అవసరం. ఐతే డొమైన్ ఎలా తీసుకోవాలి?
అలాగే డొమైన్ కొనేముందు చేయవలసిన పనులు ఏంటి? ఎలాంటి డొమైన్ తీసుకోవాలి?
అస్సలు డొమైన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇలాంటి వాటికీ ఈ ఆర్టికల్ తో సమాధానం ఇవ్వబోతున్నాను.
ముందుగా నేను చేసిన కొన్ని తప్పులు గురించి చెప్తాను. బ్లాగింగ్ గురించి కొంచెం అవగహన వచ్చినా వెంటనే డొమైన్ కొనేద్దాం అని godaddy ఓపెన్ చేసి ఒక డొమైన్ ఏ అవగహన లేకుండా కొనేసా! అదే కూడా రెండు సంవత్సరాలకి.
ఆ డొమైన్ అలానే వేస్ట్ గా ఉండిపోయింది.ఇలాంటి తప్పు మీరు చేయకూడదు అని ఈ టాపిక్ కి అస్సలు ట్రాఫిక్, సెర్చ్ వాల్యూం లేకపోయినా రాస్తున్న.
డొమైన్ Name సెలక్షన్:-
ప్రతి వెబ్సైటు ఓనర్ తన బ్లాగ్ గూగుల్ సెర్చ్ లో ఫస్ట్ పేజీ లో రావాలి అనుకుంటారు.కాబ్బటి గూగుల్ మీ బ్రాండ్ నేమ్ ని అర్థంచేసుకుంటుంది. మీ బ్రాండ్ name ని డొమైన్ నేమ్ లో include చేయడం (డొమైన్ లో మీ బ్రాండ్ నేమ్ ఉండాలి అన్నమాట) ద్వారా సెర్చ్ రిజల్ట్స్ లో మీ బ్లాగ్ కి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ బిజినెస్ కి ఒక unique ఐడెంటిటీ వస్తుంది.
మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. గూగుల్ రిజల్ట్స్ లో వచ్చే కొన్ని వెబ్సైట్ కి బ్లాగ్ పోస్ట్ కి అస్సలు సంబంధం ఉండదు. ఎంచుకున్న niche ఒకటి రాసే ఆర్టికల్స్ వేరొకటి. ఇలాంటి బ్లాగ్స్ ఇంటర్నెట్ లో కుప్పలు తెప్పలు గా ఉంటాయి. మనం ఒక నిచ్ లేదా టాపిక్ మీద మాత్రమే బ్లాగ్ రాయడం చాలా మంచి పని. మ్యాగజిన్(Publications) టైపు బ్లాగ్స్ ఇందులోకి రావు.
Example:- టెక్ వెబ్సైటు ఐతే దానికి సినిమా కీవర్డ్ include చేయడం.
డొమైన్ నేమ్ మధ్యలో హైపెన్:-
డొమైన్ నేమ్ క్లియర్ గా ఉండాలి. ఆలా అని కొంతమంది word to word కి హైపెన్ పెడుతూవుంటారు (telugu – blogging .com ). అది తప్పు, ఆలా చేయకూడదు.
telugu blogging మీ బ్లాగ్ ఐతే telugublogging .com అని లేక bloggingtelugu .com ఇలా ఉండాలి. అంటే మీ డొమైన్ నేమ్ continuous గా ఉండాలి.
hypen లాంటివి లేకుండా చూసుకోవాలి అన్నమాట.
డొమైన్ నేమ్ కి స్పేస్ అండ్ నంబర్స్ పెట్టడం. Example కి 234telugublog , telugu489blog ఇలాంటివి పెడుతుంటారు. వీలైనంత వరకు నంబర్స్ మీరు తీసుకునే నేమ్ లో పెట్టకుండా ఉండటానికి చూడండి. అది మీ బ్లాగ్ ర్యాంకింగ్ ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ ఉంది.
TLD డొమైన్ నేమ్ సెలక్షన్:-
TLD డొమైన్ ని ఎంచుకోవడం (టాప్ లెవెల్ డొమైన్)
డొమైన్ extensions (Domain in telugu) గురించి వినే ఉంటారు. (.com .in .net) వీటిని డొమైన్ extensions అంటారు. ఐతే మన బ్లాగ్ కి ఎం extension తీసుకోవాలి ?
.com అనేది టాప్ డొమైన్. ఏది మీ బ్రాండ్ కి అలాగే ప్రపంచం లో ఎక్కువ మంది prefer చేసే డొమైన్. ఇండియా లో మాత్రమే మీ targetted ఆడియన్స్ ఉంటే మీరు .in తీస్కోవచ్చు. (.org) organization కి సంబందించిన డొమైన్…ఇలా మనకి తగ్గట్టు డొమైన్స్ ఉంటాయి. (.com) తీసుకోవడానికి ప్రయత్నించండి, అది ఆల్రెడీ తీస్కుని ఉంటే .in కి వెళ్ళండి. ఇవి ఏవి available లో లేకపోతే మీరు అనుకున్న బ్లాగ్ నేమ్ మార్చుకోవడానికి ప్రయత్నించండి. డాట్ కం, డాట్ ఇన్ లేవు కదా అని .online .xyz .tech లాంటి వాటిని అస్సలు తీసుకోవద్దు.
డొమైన్ length:-
ఇంటర్నెట్ అనేది ఒక సముద్రం లాంటిది, దీనిలో కొన్ని మిలియన్ బ్లాగ్స్ ఉంటాయి. కానీ ఆడియన్స్ కి అన్ని బ్లాగ్ గుర్తు ఉండవ్. ఎందుకు అంటే వారు అన్ని బ్లాగ్ ని గుర్తుపెట్టుకోరు…
మరి మన బ్లాగ్ గుర్తువుండేలా చేయాలి అంటే ఎం చేయాలి?
డొమైన్ నేమ్ అనేది sweet అండ్ short గా ఉండాలి. ఎందుకు అంటే మనుషులు ఎక్కువ చిన్న చిన్న వాటిని సులభంగా గుర్తుపెట్టుంటున్నారు కదా అందుకు.
15 లెటర్స్ దాటకుండా ఉంటే అది రీడర్స్ కి గుర్తు ఉండేలా ఉంటుంది.
ఉదాహరణ కి smarttelugu bloggingbadi digitalbadi appdroid ఇలా చిన్నగా గుర్తువుండేలా 15 characters లోపు ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆర్టికల్ లో మీకు డొమైన్ ఎలా తీసుకోవాలి అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి.
Read the same article on the English Bloggingbadi blog – How to start a blog in telugu
No Responses