Google Adsense in Telugu:
గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి?
“Google Adsense” బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ ఉన్నవారికి తమ ఆన్లైన్ కంటెంట్ నుండి డబ్బు సంపాదించే ఒక మార్గం.
ఈరోజు మనం చూస్తున్న ప్రతి బ్లాగ్ లో యాడ్స్ కనిపిస్తున్నాయి, మరి ఆ యాడ్స్ ఎలా వస్తున్నాయి?
గూగుల్ సమస్త బ్లాగర్స్ మరియు కంటెంట్ క్రియేటర్స్ కి తన యాడ్సెన్స్ ప్రోగ్రాం లో జాయిన్ అయ్యే అవకాశం తీసుకువచ్చింది.
మనలో చాలా మందికి ఉండే కొన్ని కామన్ Questions:
- యాడ్సెన్స్ ఎలా పనిచేస్తుంది?
- యాడ్సెన్స్ అప్లై చేయటానికి ఏమి కావాలి?
- గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రాం కి ఎలా అప్లై చేయాలి?
- గూగుల్ యాడ్సెన్స్ ఎప్రువల్ ఎలా పొందాలి?
- ఒకవేళ యాడ్సెన్స్ టీమ్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి?
- తెలుగు బ్లాగ్స్ కి యాడ్సెన్స్ వర్క్ అవుతుందా?
- యాడ్సెన్స్ నుండి మనకి మనీ ఎలా వస్తాయి?
యాడ్సెన్స్ ఎలా పనిచేస్తుంది?
కంటెంట్ క్రియేటర్స్ యాడ్సెన్స్ లో జాయిన్ అవ్వుతారు. జాయిన్ అయ్యిన ప్రతి మెంబెర్ కి గూగుల్ ఒక యాడ్సెన్స్ కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ తీసుకుని తమ బ్లాగ్స్ లో ఎక్కడ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు.
మన బ్లాగ్ కి వచ్చిన రీడర్స్ ఆ యాడ్స్ పైన క్లిక్ చేస్తే మనకి కొంత మనీ వస్తుంది.
యాడ్సెన్స్ అప్లై చేయటానికి ఏమి కావాలి?
ఈ యాడ్సెన్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూదాం.
మనకి బ్లాగ్ లేదా వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ ఉంటే ఈ ప్రోగ్రాం లో మనం కూడా జాయిన్ అవ్వొచ్చు.
అప్లై చేసే ముందు కొన్ని జాగర్తలు తీసుకోవాలి వాటి గురించి చివర్లో మాట్లాదం.
గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రాం కి ఎలా అప్లై చేయాలి?
మీకు ఇప్పటి వరకు అకౌంట్ లేకపోతే signup పైన క్లిక్ చేసి మీ బ్లాగ్ లింక్ ఇచ్చి అప్లై చేయండి.
యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు యూట్యూబ్ గైడ్ లైన్స్ మరియు కండిషన్స్ రీచ్ అయ్యి ఉంటే మీకు కూడా అప్లై అవుతుంది. యాడ్సెన్స్ టీం మీ అప్లికేషన్ అప్ప్రొవె చేయాలి అంటే ఏం చేయాలి అని కూడా చూదాం.
Google AdSense ఎప్రువల్ ఎలా పొందాలి?
యాడ్సెన్స్ నుండి అప్రూవల్ పొందాలి అనేది చాల మందికి ఒక కళా. ఈరోజుల్లో యాడ్సెన్ పొందటం చాలా సులభం అయిపోయిందికాని, రెండు సంవత్సరాలు క్రితం ఇది ఒక సవాల్.
త్వరగా యాడ్సెన్స్ రావటానికి ఏం చేయాలో కొన్ని పాయింట్ చూదాం:
1 . మీరు మీ వెబ్ సైట్ లో వ్రాసే కంటెంట్ 100% మీది అయి ఉండాలి. కంటెంట్ వేరొకరి సైట్ లో కాపీ చేసి మీ వెబ్ సైట్ లో పేస్ట్ చేయకూడదు, గూగుల్ మనకంటే చాలా తెలివైంది అని గుర్తుంచుకోండి మీరు ఎక్కడ కాపీ చేసారో కూడా సింపుల్ గా పసిగడుతుంది.
కాబట్టి ఇతరుల కంటెంట్ ను కాపీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి (మీరు సొంతంగా కంటెంట్ ను రాయడం అనేది ఒక మంచి ఆలోచన).మనం ఇతరుల కంటెంట్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తే, గూగుల్ ఒక రోజు తప్పకుండా మనల్ని బెన్ చేసే అవకాశం ఉంది.
2 .గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేసే ముందు మీ బ్లాగ్ లో కావలసినంత కంటెంట్ ఉండేలా చూసుకోండి. మన బ్లాగ్ లో కనీసం 30 నుంచి 40 ఆర్టికల్ ఉంటే మంచిది అని నా సలహా.
3 .బ్లాగ్ ఆర్టికల్ రాయడం అంటే ఏదోకటి రాసేయడం కాదు మిత్రమా, ఆర్టికల్ లో కంటెంట్ అర్థవంతంగా మరియు ఉపయోగపడేలా ఉండాలి.
ఎక్కువ మంది చేసే తప్పు గ్రామర్ తప్పలు రాయడం,మీ బ్లాగ్ లో గ్రామర్ తప్పలు లేకుండా చూసుకోండి.
4 . ఆర్టికల్స్ లో కనీసం 500 నుండి 1000 పదాలు ఉండేలా చూసుకోవాలి.గూగుల్ తమ సెర్చ్ రిజల్ట్స్ లో ఎక్కువ కంటెంట్ ఇచ్చే బ్లాగ్స్ ని ముందు వరసలో చూపిస్తుంది.
5 . యూజర్స్ రాగానే ముందుగా చూసేది బ్లాగ్ డిజైన్, కాబ్బటి మీ బ్లాగ్ డిజైన్ వాళ్ళని ఆకట్టుకునే విధంగా చూసుకోండి. మీరు క్రియేట్ చేసే బ్లాగ్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి.
6 .మీరు యాడ్సెన్స్ కి అప్లై చేయాలి అనుకుంటే, ముందుగా మీ బ్లాగ్ ఏమైనా ఇతర యాడ్ నెట్వర్క్స్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే అప్లై చేసే ముందు వాటిని తీసేయండి.
7 . మనం రాసే బ్లాగ్ ఆర్టికల్స్ లో ఇతరులని కించపరిచేలా ఉండకూడదు. ఇంకా లైంగిక వేదింపులు, హర్రసెమెంట్స్, ఆయుధాలు, క్రూరమైన వాటిగురించి రాయకూడదు.
ఒకవేళ వీటిగురించి మీ బ్లాగ్ కంటెంట్ లో ఉంటే ఇప్పుడే తీసేయండి.
8 .గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయాలి అనుకునే వారికీ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలా లేని పక్షంలో మీరు మీ తల్లిదండ్రుల అకౌంట్ వాడుకుని అప్లై చేయొచ్చు.
ఒకవేళ యాడ్సెన్స్ టీమ్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీ అప్లికేషన్ ని Google Adsense తిరస్కరిస్తే, అప్పుడు ఆందోళన చెందవద్దు. మీ అప్లికేషన్ ఎందుకు తిరస్కరించబడింది అనే విషయాన్ని తెలియజేస్తూ యాడ్ సెన్స్ టీమ్ మీకు మెయిల్ పంపుతుంది.
అందువల్ల, ఆ మెయిల్ లో వారి ఏం చెప్పారో చూడండి. మీ బ్లాగ్ లో ఉన్న ప్రాబ్లెమ్ సరి చేయండి.
తరువాత తిరిగి అప్లై చేయండి, ఈ సారి మీకు తప్పకుండా అప్రూవల్ వస్తుంది.
యాడ్సెన్స్ అప్రూవల్ రాగానే మనలో ఎక్కువ మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళ యాడ్స్ పైన వాళ్లే క్లిక్ చేసుకోవడం.
ఇలా చేసేవాళ్ళు ఎక్కువ డబ్బు వస్తుంది అనే భ్రమలో ఉంటారు. కానీ నిజానికి ఇలా చేయడం వల్ల అకౌంట్ బెన్ అవుతుంది.
తెలుగు బ్లాగ్స్ కి యాడ్సెన్స్ వర్క్ అవుతుందా?
తప్పకుండా వర్క్ అవుతుంది, జూన్ 29th 2018 న Google Adsense తెలుగు బ్లాగ్స్ కి కూడా వర్తిస్తుంది అని ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది.కాబ్బటి మీరు తెలుగు లో బ్లాగింగ్ చేస్తూ మీ ఆర్టికల్స్ లో యాడ్స్ డిస్ప్లే చేయొచ్చు.
Google Adsense నుండి మనకి మనీ ఎలా వస్తాయి?
గూగుల్ యాడ్సెన్స్ తో మన బ్లాగ్ లో యాడ్స్ ప్లేస్ చేసిన తరవాత బ్లాగ్ కి వచ్చిన రీడర్స్
యాడ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇన్కమ్ జెనెరేట్ అవుతుంది.
ఓవరాల్ ఇన్కమ్ నుండి 68% కంటెంట్ క్రియేటర్ కి వస్తుంది.
ఒక నెలలోని యాడ్సెన్స్ అమౌంట్ $100 దాటితే నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి అమౌంట్ వస్తుంది.
నా సలహా ఏమిటంటే మీరు బ్లాగు ప్రారంభించిన వెంటనే Adsense గురించి ఆలోచించకండి. మంచి కంటెంట్ క్రియేట్ చేయడం, బ్లాగ్ డిజైన్ మీద ఫోకస్ చేయడం
వీటికి కొంత సమయం తీసుకోండి , తరువాత యాడ్ సెన్స్ కొరకు అప్లై చేయండి.
మీకు ఇప్పటివరకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలియకపోతే ఈ ఆర్టికల్ చదవండి.
Hi kranthi kumar, which do you use
Which theme
చాలాబాగుంది kranthi kumar. నాకు చాలా చాలా నచ్చింది. May God bless you.
క్రాంతికిరణ్ చాలా బాగా డీజియినింగ్ చేసావ్ all the best .may Godbless you
Magnus
Kranthi Kumar : meeru telugu typing ki a tools vadaru , wordpress lo themes koraku a plugins vadaro detail ga oka order prakaram blogs post cheyandi
తప్పకుండా రాస్తాను ఉదయ్ గారు.
Question ki reply ivvandi brother
em question brother…ask your question. I will answer it. lekapothe facebook page ki message cheyandi brother