ఇంటర్నెట్ లో జరుగుతున్న మోసాలు:-
మనందరికీ తెలుసు ఇంటర్నెట్ చాలా చాలా భయంకరంగా తయారయింది ఎందుకు అంటే ఆన్లైన్ లో జరిగే మోసాలు వల్ల. మీరు విన్నది నిజమే ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇవి అందరికీ తెలియకపోవచ్చు, కానీ అందరూ తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ చదవడం అయ్యాక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.
1.తక్కువ రేట్లకే మొబైల్స్:-
ఈ మధ్య మనం ఫేస్బుక్లో ఫేస్బుక్ లో ఎక్కువ చూస్తున్నది తక్కువ రేట్లకే మొబైల్స్. మనకు మార్కెట్లో లక్షలు విలువ చేసే ఫోన్లు కూడా 15000 లేదా 20000 లోపు ఇస్తాము అని ఫేస్ బుక్ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తారు. అది చూసిన జనాలు అసలు ఎలా వస్తుంది అని ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. మొబైల్ మీకు కావాలి అంటే అడ్వాన్స్ పే చేయాలి అని చెప్తారు. అప్పటికీ ఏం జరుగుతుందో అర్థంకాదు, కానీ తక్కువ రేట్ కి మంచి మొబైల్ వస్తుంది కదా అని వాళ్ళ చెప్పిన నెంబర్ కి ఫోన్ పే నుండి లేక గూగుల్ పే నుండి అడ్వాన్స్ అనేది పంపిస్తాం. పంపించిన తర్వాతి నిమిషంలోనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు.
మీరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకు అంటే వాళ్లు యూస్ చేసే మొబైల్స్ మరియు sims అమెరికా కి చెందినవి.
కాబట్టి ఆన్లైన్లో లో తక్కువ రేట్లకే మొబైల్స్ ఇస్తాం లాప్టాప్స్ ఇస్తాం కెమెరాస్ ఇస్తాం అంటే మాత్రం నమ్మి మోసపోకండి. ఇప్పటికే ఇలా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.
2.ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ (OLX Fraud):-
మీ పాత మొబైల్స్, ల్యాప్ టాప్స్ లేదా ఏదైనా మీరు వాడేసిన వస్తువులు ఓఎల్ఎక్స్ (OLX) లో అమ్మాలని చూస్తున్నారా ?
అయితే ఓఎల్ఎక్స్ లో ఉన్న కొంతమంది scammers తో జాగ్రత్తగా ఉండండి.
అసలు olx లో scams ఎలా జరుగుతున్నాయి ? చిన్న ఉదాహరణ చూద్దాం.
మీరు మీ మొబైల్ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. అది చూసి కొనుక్కునేవారు లేదా అని కొనాలి అనుకున్నవారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
మీ మొబైల్ కండిషన్ ఏంటి ఎలా ఉంది? ఏవైనా డ్యామేజ్ అయ్యిందా? ఎందుకు అమ్మేస్తున్నారు ? రేటు తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉందా ?
కానీ ఈ scammers ఏ డీటెయిల్స్ అడగకుండానే, మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి లేదా మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వండి. నేను అడ్వాన్స్ పంపిస్తాను అని చెప్తారు.
మీరు నెంబర్ ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ కి మనీ రిక్వెస్ట్ వస్తుంది. మామూలుగా అయితే వాళ్లు పే చేయాలి. కానీ రిక్వెస్ట్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని, మీకు డబ్బులు పంపించాను యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు. కొంచెం అవగాహన ఉన్నవారు దానిని ఈజీ గానే పసిగడతారు. కానీ చదువు లేని వారు లేదా టెక్నాలజీ మీద అవగాహన లేని వారు నిజమే అనుకొని యాక్సెప్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తారు. అంతే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ మనం పే చేసినట్లవుతుంది.
తరువాత మీరు మోసపోయారు అని గమనిస్తే పరవాలేదు, కానీ మీరు అప్పటికి గుర్తించకపోతే మళ్లీ మీకు మిగతా అమౌంట్ పంపుతున్నాను చూడండి అని చెప్పి, అదే ప్రాసెస్ మళ్ళీ చేస్తారు దీనివల్ల మీ వాలెట్ లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయి. ఇంచుమించుగా ఇలాగే జరగాలని ఏం లేదు. Scammers అనేక మార్గాలు జనాల సొమ్మును దోచుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి చేసే ముందు కొంచెం అన్ని చూసుకుని చేయాలి అని మర్చిపోకండి.
ఉద్యోగం పేరు చెప్పి దోచుకుంటున్నారు:-
అందరికీ తెలిసిన విషయమే, మన భారతదేశంలో నిరుద్యోగం (Unemployment) ఒక పెద్ద సమస్య.
చిన్న చిన్న సమస్యలను వాడుకొని అడ్డదారుల్లో డబ్బు ఎంత సంపాదించొచ్చు తెలిసిన మూర్ఖులకి, ఇలాంటి ఒక పెద్ద సమస్యను వాడుకుని డబ్బు ఎలా సంపాదించాలో తెలిసే ఉంటుంది కదా !
వీళ్ళ ముఖ్య ఉద్దేశం, నిరుద్యోగులను టార్గెట్ చేసి, మీకు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటారు.
అసలే ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నవారు. ఇదే మంచి అవకాశం అనుకుని డబ్బులు ఇస్తారు.
ఉద్యోగం వచ్చేసింది అని సంబర పడతారు! కానీ మోసపోయామని తెలిసిన తర్వాత చేసేదేమీ ఉండదు.
ఇలాంటి scams హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా జరుగుతున్నాయి.
కాబట్టి డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తాం అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఉద్యోగం ఇచ్చేవాడు ని స్కిల్స్ చూస్తాడు, అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకోడు.
కార్డింగ్ (Carding) :-
కార్డింగ్ అంటే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ హ్యాక్ చేసి, ఆ కార్డు లోని డబ్బులతో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడం.
ఫేస్బుక్ యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ఇంకా ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కార్డింగ్ చేస్తాం, తక్కువ రేట్లకే అమెజాన్ ఫ్లిప్ కార్ట్ ప్రోడక్ట్ మీ అడ్రస్ కి ఆర్డర్ చేస్తాం అని మాయ మాటలు చెబుతారు.
అది నమ్మి మనం వాళ్ళతో ప్రొసీడ్ అయితే, కార్డ్ కొనాలి అడ్వాన్స్ pay చేయండి అంటారు. మీరు డబ్బులు పంపిన ఒకట్రెండు రోజులు మీతో చాటింగ్ కూడా చేస్తారు. కార్డ్ వర్క్ అవ్వలేదు, కార్డు బ్లాక్ అయింది మళ్లీ ఆర్డర్ పెడతా ఈసారి కొంచెం తక్కువ అమౌంట్ పంపించు అని మళ్ళీ మీ దగ్గర డబ్బులు గుంజడానికి చూస్తారు. తర్వాత మీ కాంటాక్ట్ బ్లాక్ చేస్తారు.
ఇలాంటి క్రెడిట్ కార్డ్ fraud చేసే వారి నుండి ఎలాంటి మెసేజెస్ వచ్చిన సింపుల్ గా బ్లాక్ చేసేయండి.
Paytm Double Amount Scam:-
పేటీఎం నుండి 5000 పంపిస్తే ఒక గంటలో 10000 నీకు పంపిస్తా. 2000 పంపిస్తే 5000 నీకు పంపిస్తా.
దీనిని పేటీఎం డబల్ అని వాళ్ళు పిలుచుకుంటారు. అంటే మీరు పేటీఎంలో పంపించిన అమౌంట్ ని డబల్ చేసి మీకు పంపిస్తారు. ఆ పంపించిన దాంట్లో నాకు 10% ఇవ్వాలి అని చెప్తారు.
వాడికి కమిషన్ ఇవ్వాలి అంటున్నాడు కాబట్టి ఇది నిజమే అని మీరు డబ్బులు పంపిస్తే, మీ డబ్బులు గోవిందా!
ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అయితే ఇది మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి చేయొచ్చు కదా అని అడిగితే, వాళ్ళు ఇచ్చే సమాధానం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చేయకూడదు. లేదా మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కువ ఎక్కువ అమౌంట్ పంపించేశాను అని చెబుతారు.
ఈ పేటీఎం డబల్ scam ఎక్కువగా టెలిగ్రామ్ గ్రూప్ లో జరుగుతుంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండండి.
ఇలాంటి scams మనం రోజు చూస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు కొత్త కొత్త వాటితో మళ్లీ వస్తున్నారు. Be alert మిత్రమా 🙂
ఈ ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీలైనంత మందికి ఈ scams మీద అవగాహన కల్పించండి.
Kranthi very good article.
Good blog post Kranthi. ఈరోజుల్లో జరుగుతున్న మోసాల్ని వరుసపెట్టి, ఉతికి అరేశావ్. ఇలాంటి బ్లాగ్ పోస్ట్స్ ద్వారా చాలా మందికి ఇటువంటి వాటిపైన మంచి అవగాహన వస్తుంది. కాకపోతే ఇలాంటి మంచి బ్లాగ్ పోస్ట్స్ ఎక్కువమందికి రీచ్ అవ్వాలి. అప్పుడే నీ ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. All the best Kranthi.
Awesome work by u kranthi garu. Iam Dr Daiva from Tirupathi.
Thank you so much Daiva garu.
This king of frauds..i have already experianced …. i am loss huge