మీరు రాసే ప్రతి ఆర్టికల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ చేయడం ఎలా? How to Rank your blog article in telugu?
Rank your article:
మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే మీకు బ్లాగింగ్ మీద ఇంటరెస్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మన తెలుగు వాళ్లలో చాలామంది బ్లాగ్ క్రియేట్ చేసి కొంతకాలం రన్ చేసి తరవాత పూర్తిగా బ్లాగింగ్ ఫీల్డ్ వదిలేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బ్లాగ్ కి ట్రాఫిక్ రాకపోవడం.
మరి మనం క్రియేట్ చేసి బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలి అంటే ఎం చేయాలి?
ఒక బ్లాగ్ కి ట్రాఫిక్ రెండు మార్గాల ద్వారా వస్తుంది.
1. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్.
2. సోషల్ మీడియా.
ఈ ఆర్టికల్ లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ద్వారా మన బ్లాగ్ కి ఎలా ట్రాఫిక్ వస్తుంది అనేది చూదాం.
మనం రాసిన బ్లాగ్ ఆర్టికల్ ర్యాంక్ అవ్వడానికి చేయాల్సిన కొన్ని పనులు:
బ్లాగ్ ఆర్టికల్ లో కీవర్డ్ ఆప్టిమిజింగ్:
SEO లో కీవర్డ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబ్బటి సరైన కీవర్డ్స్ కి ఆర్టికల్ ని ఆప్టిమైజ్ చేయడం చాలా అవసరం.
చాలా మందికి కీవర్డ్స్ ఎలా ఉపయోగించాలో తెలియదు. మనం ఒక ఆర్టికల్ రాస్తున్నాం అంటే కీవర్డ్ రీసెర్చ్ చేసి యూజర్స్ వెతుకుతున్న కీవర్డ్స్ తెలుసుకుని, వాటితో మన బ్లాగ్ పోస్ట్ కి తగ్గ బెస్ట్ కీవర్డ్స్ తో SEO చేసి ఆర్టికల్ ని ర్యాంక్ చేయాలి.
కీవర్డ్స్ ని టైటిల్ లో పెట్టడం:
మీరు రాసే ఆర్టికల్ టైటిల్లో కీవర్డ్స్ పెట్టడం ద్వారా యూజర్స్ ని ఆకట్టడంలో బాగా ఉపయోగపడుతుంది.
ఆర్టికల్ హెడ్డింగ్(టైటిల్) లో యూసర్ వెతుకుతున్న కీవర్డ్ పెట్టడం వల్ల మన ఆర్టికల్ సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి.ఆర్టికల్ టైటిల్ రాసేటప్పుడు మనం ర్యాంక్ చేయబోయే కీవర్డ్స్ అనేవి (బెగిన్నింగ్ లో)ముందు పెట్టాలి.
ఉదాహరణకి తెలుగు బ్లాగ్స్ లేదా తెలుగు వెబ్సైట్ గురించి రాస్తున్నాం అనుకుందాం.
టైటిల్:- బెస్ట్ తెలుగు బ్లాగ్స్ ఫర్ బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్.
తెలుగు సాంగ్స్ అనే సెర్చ్ చేస్తే తెలుగు సాంగ్స్ అని టైటిల్ స్టార్టింగ్ లో పెట్టిన ఆర్టికల్స్ ముందు వచ్చాయి.
ఆర్టికల్ లో కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయడం:
ఇదివరకటి రోజుల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆర్టికల్ లో ఎక్కువ కీవర్డ్స్ ఉపయోగిస్తే వాటిని ఫస్ట్ పేజీ లో చూపించేది. దీనినే కీవర్డ్ stuffing అంటారు, ప్రస్తుతం రోజుల్లో ఈ కీవర్డ్ stuffing చేయడం వల్ల కీవర్డ్స్ అనేవి ఓవర్ ఆప్టిమైజ్ అవుతున్నాయ్ తప్పితే పెద్దగా ఉపయోగం ఉండదు.
కానీ తప్పకుండా మనం ఆర్టికల్ కొన్ని చోట్ల కీవర్డ్స్ పెట్టాల్సివుంటుంది. SEO కోసం కాకుండా కంటెంట్ కి రిలేటెడ్ గా ఎక్కడ వాడుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ ఉపయోగించండి.
LSI కీవర్డ్స్ ఆర్టికల్ బాడీ లో ఉపయోగించడం:
లేటెంట్ సెమాంటిక్ ఇండెక్సింగ్. LSI అంటే గూగుల్ మన కంటెంట్ లో వెతికే రిలేటెడ్ కీవర్డ్స్ .
చాలా మంది LSI కీవర్డ్స్ అంటే పర్యాయపదాలు అనుకుంటారు, కానీ అవి పర్యాయపదాలు కాదు.
ఉదాహరణకు, “జాగింగ్” లాంటి పదాన్ని తీసుకోండి.
“రన్నింగ్” అనేది “జాగింగ్” యొక్క పర్యాయపదం.
మన ఆర్టికల్ లో ఆ పర్యాయపదాన్ని ఉపయోగించడంలో తప్పు లేదు. వాస్తవానికి, ఇది ఆన్-పేజీ SEO తో సహాయపడుతుంది.
కానీ ఇది ఎల్ఎస్ఐ కీవర్డ్ కాదు.
“జాగింగ్” కోసం ఎల్ఎస్ఐ కీవర్డ్స్ : “షూస్”, “ఎక్సర్సిస్”, “డైలీ వాక్” మరియు “5k రన్” లాంటివి.
మన ఆర్టికల్ లో కంటెంట్ కి తగ్గట్టుగా LSI Keywords ఉంటే గూగుల్ ఫస్ట్ పేజీ లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
గూగుల్ సెర్చ్ suggestions లో వచ్చిన LSI కీవర్డ్స్ ఉపయోగించడం ద్వారా మనం రాసిన ఆర్టికల్ గూగుల్ లో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి.
మీ ఆర్టికల్ యొక్క URL చదవగలిగేలా చేయండి:
చాలా మంది బ్లాగింగ్ లో చేసే తప్పులో URL ఏదొకటి పెటేయడం.మీరు ఇప్పటికే ఇలాంటి URL చూసే ఉంటారు. ఉదాహరణకి “article-id-89231.html” “2019/news/article-id-231” ఇలా ఉంటాయి.
ఇలాంటి యుఆర్ఎల్ పెట్టడం వల్ల మన బ్లాగ్ ఆర్టికల్ ర్యాంకింగ్ పడిపోతుంది. గూగుల్ ఇండెక్స్ చేసే సమయం లో యుఆర్ఎల్ కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.
ఇలా URLక్రియేట్ చేయడం ద్వారా మీ ఆర్టికల్ కి SEO ఉపయోగపడుతుంది మరియు యూసర్ కి మన url కొంచెం ప్రొఫెషనల్ గా కనపడుతుంది కాబ్బటి మన URL మీద క్లిక్ చేయటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కంటెంట్ length మెరుగుపరచడం:
కంటెంట్ అంటే ఏదొక రాసేయడం కాదు, యూజర్స్ కి అర్థమైయే విధంగా వాళ్ళ అవసరాలు తెలుసుకుని రాయడం.తెలుగు లో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చేసే తప్పు ఇదే. మన రాసే కంటెంట్ యూసర్-ఫ్రెండ్లీ గా ఉండాలి.
readibility స్కోర్ ఎక్కువ ఉండాలి, readibility అంటే మన ఆర్టికల్ చదవటానికి ఎలా ఉంది, అర్థవంతంగా ఉందాలేదా అనేది గూగుల్ చూస్తుంది.
మీరు గూగుల్ రీసెర్చ్ చేసి చూడండి, ఒక టాపిక్ గురించి వెతుకుతున్నప్పుడు గూగుల్ ఫస్ట్ పేజీ రిజల్ట్స్ ఒకసారి చెక్ చేయండి.
మీకే అర్ధమవుతుంది, ఎక్కువ lenght ఉన్న కంటెంట్ టాప్ లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.
ఒక టాపిక్ మీద ఆర్టికల్ రాయటానికి మీరు సిద్ధంగా ఉంటే, ముందు టాపిక్ గురించి రీసెర్చ్ చేయండి. వీలైనంత ఎక్కువ కంటెంట్ రాయడానికి చూడండి. కనీసం ఆర్టికల్ లో 500-1000 పదాలు ఉండే విధంగా కంటెంట్ ప్లాన్ చేయండి.
బ్లాగ్ ఆర్టికల్ కి meta description రాయడం:
meta description అంటే ఆర్టికల్ మొత్తని 10-15 పదాలతో యూసర్ కి తెలిసేలా ఒక రెండు లైన్స్ ఇన్ఫర్మేషన్.
ఇది గూగుల్ లో ర్యాంక్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది.
మన ఆర్టికల్ snippet కనిపిస్తే, యూసర్ ముందుగా చదివేది టైటిల్ మరియు meta description.
మన టార్గెటెడ్ కీవర్డ్స్ meta description లో పెట్టడం ద్వారా ర్యాంకింగ్ & SEO ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఎక్కువ ఉంది.
meta Description రాయటానికి మార్కెట్లో ఉన్న బెస్ట్ వర్డుప్రెస్ ప్లగిన్ (టూల్) Free Yoast SEO .
ఈ టూల్ తో SEO టైటిల్, URL (slug), Meta Description ను ఎడిట్ చేయవచ్చు.
H2 మరియు H3 Tags లో కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయడం:
ఆర్టికల్ ని కొన్ని సెక్షన్స్ గా డివైడ్ చేసి, ఒక్కో సెక్షన్ కి ఒకో హెడ్డింగ్ పెట్టుకోవడం చాలా మంచి పద్దతి.
ఈ H2 & H3 అనేవి HTML లో హెడ్డింగ్ కోసం వాడతారు.
ఆర్టికల్ రాసే సమయం లో మనం కొన్ని Headings అని పెట్టుకుంటాం. ఉదాహరణకి హెల్త్ టాపిక్ మీద బ్లాగ్ పోస్ట్ రాస్తుంటే “ఏం ఆహారం తీసుకోవాలి” “చెయ్యవలసిన పనులు” ఇలా కొన్ని Side Headings ఉంటాయి.
ఈ Headings లో Keywords ఇంక్లూడ్ చేయడం ద్వారా కూడా మన ఆర్టికల్ ర్యాంక్ మెరుగుపడొచ్చు.
మీ Blog Images ఆప్టిమైజ్ చేయండి:
గూగుల్ సెర్చ్‌లో మీ ఆర్టికల్ ర్యాంకింగ్‌ను పెంచడానికి మార్గం మీరు ఉపయోగించిన Images ని ఆప్టిమైజ్ చేయడం.ఒక ఆర్టికల్ రాస్తున్నాం అంటే దాంట్లో తప్పకుండా ఇమేజెస్ అనేవి ఉంటాయి. మరి ఆ ఇమేజెస్ ఆప్టిమైజ్ చేయాలి కదా.
ఇమేజ్ ఆప్టిమైజషన్ అంటే ఏంటో చూద్దాం.
మీరు ఫోటోషాప్ తెలిసినవారైతే, మీ బ్లాగ్ ఇమేజెస్ ఈజీగా ఫోటోషాప్ లో డిజైన్ చేసేస్తారు. కానీ మీరు గమనిస్తే ఫోటోషాప్ లాంటి వాటితో డిజైన్ చేసిన ఇమేజెస్ చాలా క్వాలిటీ మరియు ఎక్కువ సైజు లో ఉంటాయి.
గూగుల్ లో ఆర్టికల్ లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం ఈ ఇమేజెస్ లోడ్ అవ్వడానికి తీసుకుంటుంది .ఇలా ఇమేజ్ లోడింగ్ టైం ఎక్కువ ఐతే, చదివే యూసర్ విసుగు చెందుతాడు.మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇమేజ్ ఆప్టిమైజషన్ తప్పనిసరి.
ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా సైజు మాత్రమే తగ్గించే సైట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి.
అందులో ఒకటి http://compressjpeg.com. మన రీసెర్చ్ చేసి తెలుసుకుంటే ఇలా చాలా సైట్స్ ఉంటాయి.
సరే ఇమేజ్ కంప్రెస్ చేశాం అయిపోయింది అనుకుంటే పొరపాటే, ఇమేజ్ ఆప్టిమైజషన్ అంటే సైజు ఒక్కటే కాదు.ఇమేజ్ అప్లోడ్ చేసే ముందు దానికి మీరు రాస్తున్న ఆర్టికల్ కి తగ్గట్టు ఒక నేమ్ సెట్ చేయాలి, దీనినే ఇమేజ్ టైటిల్ అంటారు.
ఇక పోతే ఇంకొకటి ఇమేజ్ Alt Text, ఇది SEO లో బాగా ఉపయోగపడుతుంది. కీవర్డ్స్ ఇమేజ్ యొక్క Alt Text లో పెట్టడం ద్వారా ఇమేజ్ ర్యాంకింగ్ ఫెక్టర్ పెరుగుతుంది.
మీ బ్లాగ్ మొబైల్ ఫ్రెండ్లీ గా ఉండేలా చూసుకోండి:
మన అందరికి తెలిసిన విషయమే, ఈరోజు ఎవ్వరి చేతిలో చూసినా smartphone అనేది ఉంటుంది.
కాబ్బటి మీ టార్గెట్టెడ్ యూసర్ సగం పైగా ఈ మొబైల్ యూసర్ అయ్యిఉంటారు. సగం పైగా మీ ట్రాఫిక్ మొబైల్ నుండి వస్తుంది అంటే మీరు మీ బ్లాగ్ ని మొబైల్ ఫ్రెండ్లీ చేయాలి కదా.
మొబైల్ ఫ్రెండ్లీ అంటే ఏంటో కాదు మనకి తెలిసిన విషయమే, మీ బ్లాగ్ యొక్క మొబైల్ ఇంటర్ఫేస్, ఆర్టికల్స్ ఎలా display అవుతున్నాయి. సైట్ లోడింగ్ టైం, సైట్ ఇంటర్ఫేస్ (మొబైల్ వ్యూ customization చేయాలి).
మొబైల్ యూజర్స్ నుండి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి సైట్ లోడింగ్ టైం ముఖ్యం. కాబ్బటి గూగుల్ AMP అనే ఫాస్ట్ లోడింగ్ వెబ్ పేజెస్ ని తీసుకుని వచ్చింది.
AMP అంటే Accelerated mobile pages అని అర్ధం. మనం రాసిన ఆర్టికల్ కి ఇలా Amp ఉపయోగించడం వల్ల చాలా స్పీడ్ గా ఆర్టికల్ లోడ్ అవుతుంది.ఈ AMP గురించి పూర్తి వివరంగా మరొక ఆర్టికల్ లో రాస్తాను.
చాల బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్ సంతోషం.