రవి కిరణ్, తెలుగు బ్లాగింగ్ కమ్యూనిటీ లో అందరికి తెలిసిన వ్యక్తి. బ్లాగింగ్ అంటే తెలిసినా కూడా ఎలా చేయాలి?
ఏం చేస్తే బ్లాగింగ్ లో సక్సెస్ వస్తుంది? అనేవి మనలో చాలా మంది కి తెలీదు.
ఐతే తనకి ఉన్న బ్లాగింగ్ knowledge మరియు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తో తెలుగు లో కూడా బ్లాగింగ్ ఇండస్ట్రీ ఇంకా పెరగాలి అని ఉదేశ్యం తో బ్లాగింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్న కొత్త వారిని తన కోర్స్ తో టీచ్ చేయడం స్టార్ట్ చేసారు.
రవి కిరణ్ తో నా పరిచయం:
బ్లాగింగ్ , SEO , డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు కానీ ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అనే విషయం నాకు తెలీదు. వాటి గురించి వెతుకుతూ ఉండగా, నాకు smarttelugu బ్లాగ్ కనిపించింది.
మన తెలుగు లో blogging , business , startup సంబందించిన ఆర్టికల్స్ smarttelugu లో ఉంటాయి. అలా డైలీ రవికిరణ్ గారి బ్లాగ్ ని ఫాలో అయ్యేవాడిని.
తరవాత తన దగ్గర కోర్సెస్ ఉన్నాయి అని తెలిసి వాటిని తీసుకుని నా బ్లాగింగ్ నాలెడ్జి ఇంకా పెంచుకున్న. కొంత వరకు నాకు తెలిసినవే ఉన్నకాని, తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను.
నేర్చుకోవడం అంటే అయ్యింది కానీ, నా అంతటా నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేయలేదు.
theoretical గా వచ్చు అనే చోటే ఆగిపోయాం. రవికిరణ్ గారు మెయిల్స్ లో చాలా మోటివేట్ చేసేవారు. మనం నేర్చుకుంటే సరిపోదు, వాటిని ప్రాక్టికల్ గా apply చేయాలి.
అలా మొదలైంది bloggingbadi , ఇప్పటికి సంవత్సరం అవుతుంది.
అలాగే రవికిరణ్ గారికి డైలీ టచ్ లో ఉండే వాడిని. smarttelugu లో ఏమైనా problems ఉన్న వాటిని తనకి చెప్పేవాడిని. అనుకోకుండా నాకు రవికిరణ్ గారి మధ్య ఒక bonding ఏర్పడింది.
రవికిరణ్ గారి కోర్స్ రివ్యూ:
నేను నా అనిపించింది రాస్తున్నాను. నేను రవి గారిదగ్గర కొన్ని కోర్సెస్ తీసుకున్నాను. అవి SEO course, content creation course, digital marketing course .
ఐతే నేను ఎక్కువగా గమనించింది ఏంటి అంటే, ఒక కేస్ స్టడీ తీసుకుని ప్రాక్టికల్ గా explain చేస్తారు.
మనకి చెప్పడానికి మార్కెట్ లో చాల మంది ఉంటారు. కానీ, ఇలా ఉంటది అని Real-time లో practical చూపించడం చాలా తక్కువ మంది చేస్తారు.
ఒక చిన్న ఉదాహరణగా బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అని ThrillerTelugu అనే బ్లాగ్ క్రియేట్ చేసి చూపించారు.
టూల్స్ ఏం ఏం ఉన్నాయి అని చెప్పడం కంటే, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది చెప్తే నేర్చుకునే వారికీ అర్ధమవుతుంది.
రవికిరణ్ గారు చేసింది అదే. అందుకే నాకు తన కోర్స్ తీసుకుని నేర్చుకుని అప్లై చేయడం ఇష్టం గా మారింది.
కోర్స్ తీసుకున్న వారికీ సపోర్ట్ ఎలా ఉంటుంది ?
కోర్సెస్ లో enroll అయ్యాకా స్టార్టింగ్ లో మెయిల్ ద్వారా రవికిరణ్ గారు సపోర్ట్ ఇచ్చే వారు.
తరవాత ఫేస్బుక్ ప్రీమియం గ్రూప్, అలాగే ప్రతి శుక్రవారం ప్రీమియం గ్రూప్ లో లైవ్ డౌట్స్ క్లియర్ చేయడం, కోర్స్ తీసుకున్న వారికి గైడ్ చేయడం లాంటివి చేస్తారు.
ఇవి కాకుండా రవికిరణ్ కోర్స్ మెంబెర్స్ కి చేస్తుంది ఏంటి?
మీరు ఇప్పటికే తెలుగు బ్లాగ్ రన్ చేస్తూ ఉంటే తెలుగు బ్లాగ్స్ కి అంత తొందరగా యాడ్సెన్స్ ఇవ్వడం లేదు అని మీకు తెలిసే ఉంటుంది.
బ్లాగ్ క్రియేట్ చేసి కంటెంట్ ఉన్న సరే Google Adsense రాకా కొంత మంది కొత్త బ్లాగర్స్ ఇబ్బంది పడుతున్నారు.
రవికిరణ్ గారు వేరే యాడ్ నెట్వర్క్ తో మాట్లాడి తెలుగు బ్లాగ్స్ మోనేటిజషన్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
అలాగే తాను ఫ్యూచర్ లో ఏదైనా ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఉంటే ప్రీమియం గ్రూప్ లో మంచి గా డెడికేటెడ్ గా వర్క్ చేసే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది.
డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ లాంటి జాబ్ ఆఫర్స్ రవికిరణ్ అన్న క్రియేట్ చేసిన ప్రీమియం గ్రూప్ ద్వారా తెలుస్తాయి. smarttelugu ద్వారా రెఫర్ చేయడం లాంటిది (మనలో కూడా టాలెంట్ ఉంటేనే).
Smarttelugu SEO Course Review :-
SEO అనే పదం చాలా మంది వినే ఉంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ అనేది బ్లాగింగ్ మీద కొంచెం అవగాహనా ఉన్న వారికీ తెలిసే ఉంటుంది.
SEO అంటే మనం మన వెబ్ సైట్ లేదా వెబ్ పేజీ ని గూగుల్ సెర్చ్ ఫస్ట్ పేజీ లో కి తీసుకురావడానికి చేసే ఒక టెక్నిక్.
అస్సలు Seo ఎన్ని విధాలు ఉంటాయి అనేది చాలా తక్కువ మందికి తెలుసు.
seo టైప్స్ గురించి నాకు ఈ కోర్స్ లో జాయిన్ కాకముందే తెలిసిన పూర్తీ అవగాహనా లేదు.
ఈ కోర్స్ లో మీరు Seo గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు.
మీరు ఒక బ్లాగ్ లేదా వెబ్సైట్ కి Seo ఎలా చేయాలి? మరియు
Onpage,Offpage Seo ఎలా చేయాలి?
మన బ్లాగ్ గూగుల్ లో కనిపించడానికి ఎం చేయాలి?
బ్లాగ్ ని గూగుల్ కి తెలిసేలా ఎలా చేయాలి?
Seo చేయడానికి ఎలాంటి టూల్స్ వాడాలి?
meta keywords మరియు meta description ఎలా రాయాలి?
Technical Seo ఎలా చేయాలి?
Links Building ఎలా చేయాలి?..ఇంకా ఇలా చాలా విషయాలు Practical గా నేర్చుకుంటారు.
మార్కెట్ లో ఈ కోర్స్ చాలా ఎక్కువ అమ్ముతారు(కావాలంటే ఒకసారి చెక్ చేయండి) కానీ రవి కిరణ్ గారు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు లో తక్కువ ధరలో ఇస్తున్నారు.
Note :- పైన చెప్పిన అన్ని మీరు ఈ కోర్స్ లో practical గా case study ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది.
Smarttelugu Seo Course Pro’s and Con’s :-
Pros :-
* మీరు ఈ కోర్స్లోతెలియని విషయాలు నేర్చుకోవడం
* ప్రతి విషయం practical గా ఒక బ్లాగ్ మీద apply చేసి చూపించారు.
* మనకి రీసెర్చ్ మొత్తం case Study ఆధారంగా చూపించారు, దీని వాళ్ళ మనకి ఎలా చేయాలి అనేది తెలుస్తుంది.
Cons:-
* తెలుగు బ్లాగ్ లో Seo పూర్తీగా చేయలేము, ఎందుకు అంటే తెలుగు పదాలతో చాలా తక్కువ మంది వెతుకుతున్నారు (కానీ మనం ఇంగ్లీష్ టైటిల్స్ మరియు కీవర్డ్స్ తో మేనేజ్ చేయొచ్చు).
నేను రాసిన రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్.
ఈ ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకో రెండు ఆర్టికల్స్ (FaceBook + Email Marketing) మరియు Content Creation వీటి మీద నా రివ్యూ రాస్తాను.
చాలా బాగా వ్రాసారు రవి గారి గురించి… వారి కంటెంట్, నిర్మాణాత్మకమైన,సులభతరమైన
బోధనా పద్దతి శ్లాఘనీయం.
నేనూ వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే బ్లాగ్ వైపు వచ్చాను. వారు అందిస్తున్న సహాయము,సలహాలు అమూల్యం.
ధన్యవాదములు
సదాశివ