what is web hosting in telugu? Hosting selection guide
Share this article in Social Media
Web Hosting meaning in Telugu:-
వెబ్ hosting అంటే ఏంటి అది మనకు ఎందుకు అవసరం వెబ్ హోస్టింగ్ ఎక్కడ కొనాలి? మంచి హోస్టింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? ఇలా హోస్టింగ్ గురించి మరెన్నో డౌట్ ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తాను.
బేసికల్ గా మన కంప్యూటర్ లో ఫైల్స్ మనం మాత్రమే యాక్సెస్ చేయగలం అలా అని మనం అనుకున్నవి మన కంప్యూటర్ లో మాత్రమే ఉంచుకుంటే ఇంటర్నెట్ లో ఉన్న జనాలు వాటిని ఎలా చదువుతారు.
టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి అలాగే వెబ్ డెవలపర్ కి తెలిసే ఉంటుంది మన కంప్యూటర్లో లాంటి సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుని Xampp ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.కానీ అది మనం మాత్రమే యాక్సెస్ చేయగలం బయట ప్రపంచంలో యాక్సెస్ చేయలేరు.
మరి ఇంటర్నెట్ లో ఉన్న అందరూ మన ఫైల్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా ??
అందుకనే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ స్టోరేజ్ ప్రొవైడర్ గా ఉంటాయి. ఆ కంపెనీలో కొంత స్టోరేజ్ మనం కొనుక్కుని మన ఫైల్స్ ఆ స్టోరేజ్ లో పెట్టి ఇంటర్నెట్లో అందరికీ యాక్సెస్ అయ్యే విధంగా ఉంచుతాము.
మనం కొంటున్న ఆ స్టోరేజ్ నే టెక్నికల్ టర్మ్స్ లో హోస్టింగ్ అంటారు.ఇప్పుడు మీకు హోస్టింగ్ అంటే ఏమిటో ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను.
హోస్టింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి ?
షేర్డ్ హోస్టింగ్
cloud హోస్టింగ్
vps hosting
ఇలా కొన్ని రకాల హోస్టింగ్ ఉంటాయి.
అయితే ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ స్టాట్ చేస్తున్నా కొత్తవారికి షేర్డ్ హోస్టింగ్ ప్లాన్స్ సూట్ అవుతాయి.
cloud హోస్టింగ్ ,vps hosting ఇవి చిన్న చిన్న బిజినెస్ లేదా కొంత ఎక్కువ ట్రాఫిక్ వచ్చే సైట్స్ కి ఉపయోగపడతాయి.
షేర్డ్ హోస్టింగ్ లో ఎన్ని ప్లాన్స్ ఉంటాయి వాటిలో మనకి ఏ plan సెట్ అవుతుంది.
షేర్డ్ హోస్టింగ్ లో ఉండే ప్లాన్స్:-
ఇవి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కానీ ఫ్యూచర్స్ లో మాత్రం అన్ని సిమిలర్ గానే ఉంటాయి.
సింగిల్ వెబ్ హోస్టింగ్ (starter pack)
మల్టీ వెబ్ హోస్టింగ్ (Multi-domain pack)
బిజినెస్ Web hosting. (Multi-domain with extra features)
అయితే మరి ఈ మూడు ప్లాన్స్ కి తేడా ఏమిటి ?
సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ లో మీరు ఒక వెబ్ సైట్ మాత్రమే నిర్వహించగలరు.
మల్టీ వెబ్ హోస్టింగ్ లో ఒకటి కన్నా ఎక్కువ వెబ్సైట్ లేదా బ్లాగ్ ని మీరు క్రియేట్ చేయగలరు.
ఇకపోతే బిజినెస్ హోస్టింగ్ లో కూడా ఒకటి కంటే ఎక్కువ బ్లాగ్స్ ని క్రియేట్ చేయవచ్చు కానీ మల్టీ వెబ్ పోస్టింగ్ లో ఉన్న ఫ్యూచర్స్ కంటే కొన్ని ఫ్యూచర్స్ అదనంగా ఉంటాయి.
ఇంటర్నెట్ మార్కెట్లో web hosting companies చాలానే ఉన్నాయి. అయితే మరి నేను ఏ కంపెనీలో కొనాలి?ఏం ఏం పరిగణలోకి తీసుకుని నేను వెబ్ hosting తీసుకోవాలి ?
ఒక హోస్టింగ్ మంచి హోస్టింగ్ అని ఎలా డిసైడ్ చేస్తాం:-
price (ధర)
ఈజీ టూ యూస్ (Easy to Access and Manage)
కస్టమర్ సపోర్ట్ (Customer support)
సర్వర్ అఫ్ టైం (server uptime)
Price:-
ధర అనేది చాలా ముఖ్యమైన అంశం.మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నప్పుడు ఏ కంపెనీలో ప్రైస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. మన వెబ్ సైట్ కి అవసరమైన ప్లాన్ ఏ దారిలో వస్తుందో చూసుకోవాలి.
కొన్ని హోస్టింగ్ కంపెనీస్ లో ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మనం కొన్న లేనంత ఉంటుంది. మరి మన బ్లాగ్ కి తగ్గ హోస్టింగ్ మనకి తగ్గ ప్రైస్ లో తీసుకోవడం చిన్న విషయం కాదు.
ఈజీ టు మేనేజ్:-
మీరు తీసుకుంటున్న హోస్టింగ్ ప్రొవైడర్ గురించి ఇంటర్నెట్లో వెతికితే చాలానే ఇన్ఫర్మేషన్ వస్తుంది.
దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది C-ప్యానల్ (C panel) అలాగే యూజర్ ఇంటర్ఫేస్ (user interface – UI).
కొన్ని హోస్టింగ్ ప్రొవైడర్స్ లో C-ప్యానల్ అలాగే ఇంటర్ఫేస్ అనేది చాలా గజిబిజిగా ఉంటుంది కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్న వారికి అతి పెద్ద తలనొప్పి.
కాబట్టి క్లీన్ ఇంటర్ఫేస్ కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్న వారికి కూడా అర్థమయ్యే విధంగా ఉండే హోస్టింగ్ ని ఎంచుకోవాలి.
ఇలా చేస్తే మీరు టెక్నికల్ సపోర్ట్ కోసం ఇంకొకరు దగ్గరికి వెళ్ళవలసిన పని ఉండదు.
కస్టమర్ సపోర్ట్:-
కస్టమర్ సపోర్ట్ అతిముఖ్యమైన ఫ్యాక్టర్ (అంశం).
మీ బ్లాగ్ కి ఏదైనా టెక్నికల్ error వస్తే వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యేది కస్టమర్ సపోర్ట్ కే.మరి కస్టమర్ సపోర్ట్ మనం తీసుకుంటున్న హోస్టింగ్ కంపెనీ ఏ విధంగా ప్రొవైడ్ వేస్తుంది ?
ఇంటర్నెట్ లో ఉన్న అన్ని కంపెనీస్ 24/7 కస్టమర్ సపోర్ట్ అని చెప్పుకుంటాయి కానీ అది వాస్తవం కాదు.
పెద్ద బ్లాగర్స్ లేదా డిజిటల్ మార్కెట్ అర్స్ నుండి నేను ఈ హోస్టింగ్ తీసుకున్నాను కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంది అని వినే ఉంటారు.
అది వాళ్ళు దేని ఆధారంగా చెప్తారు అంటే వాళ్ల బ్లాగ్ కి ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చే సమయంలో వాళ్ళు కస్టమర్ సపోర్ట్ తో కాంటాక్ట్ అవుతారు.అలా అయిన వెంటనే కస్టమర్ సపోర్ట్ స్పందించి వారికి కావలసిన సపోర్ట్ అందిస్తుంది.
అయితే కొన్ని కంపెనీస్ లో మీరు కాంటాక్ట్ అయిన వెంటనే టెక్నికల్ సపోర్ట్ అందించక లేకపోవచ్చు.
హోస్టింగ్ తీసుకునే ముందు ఆ కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ ఎలా ఉందో ఇంటర్ నెట్ లో కొన్ని రివ్యూస్ చూడండి. కొంతైనా రీసెర్చ్ చేయకుండా ఏది కూడా కొనద్దు.
సర్వర్ అప్ టైం:-
సర్వర్ అప్ టైం అంటే మన సర్వర్ ఇంటర్నెట్ కి ఎంత టైం కనెక్ట్ అయి ఉంటుంది అనేదాన్ని Uptime అంటారు.
మన బ్లాగ్ ఇంటర్నెట్కి 24 గంటలు కనెక్ట్ అయి ఉంటే ఆ రోజుల్లో అప్ టైం 100% ఉన్నట్టు.
అప్ టైం ఎలా కాలిక్యులేట్ చేస్తారు.
నెలకి 30 రోజులు అనుకుంటే , 30 × 24 = 720 గంటలు. అంటే నెలకి 720 గంటలు అన్నమాట.
అయితే ఒక నెల లో సర్వర్ డౌన్ టైం 5 గంటలు అనుకుంటే, 720-5=715.
(715/720)/100=99.3% సర్వర్ అప్ టైం అన్నమాట.
మీ బ్లాగ్ యొక్క సర్వర్ uptime తెలుసుకోవడానికి Uptime Robot మరియు Pingdom లాంటి వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి.
ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత uptime టైం ఎక్కువ ఉంటే అంత మంచి performance ఉంటుంది.
హోస్టింగ్ ప్రొవైడర్స్ అన్నింటిలో కూడా సర్వర్ అప్ టైం 99.5% నుండి 99.9% అని రాస్తారు.
షేర్డ్ హోస్టింగ్ కి dedicated హోస్టింగ్ కి తేడా ఏంటి?
షేర్డ్ హోస్టింగ్ అంటే ఒక పెద్ద storage లో షేర్డ్ హోస్టింగ్ ప్లాన్ తీసుకున్న బ్లాగ్స్ లేదా వెబ్సైట్ అన్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనతో పాటుగా చాలా మంది కొంత స్పేస్ ని షేర్ చేసుకుంటారు.
అందుకే దీనికి షేర్డ్ హోస్టింగ్ అని పేరు పెట్టారు. హేయ్ సరదాగా అన్న మాస్టారు, పేరు ఎలా పెట్టారో నాకు తెలీదు.
మరి dedicated హోస్టింగ్ ఐతే ఏం చేస్తారు?
పేరులోనే ఉంది. మనం కనుక ఈ dedicated హోస్టింగ్ తీసుకుంటే మనకి ప్రత్యేకం గా ఒక స్టోరేజ్ ఇస్తారు. ఈ space మనం ఎవరితోనూ షేర్ చేసుకోము. కాబ్బటి ట్రాఫిక్ ఎక్కువ వచ్చిన ఏది హేండిల్ చేయగలేదు.
Hosting ప్రొవైడ్ చేసే కంపెనీస్ :-
WordPress అఫీషియల్ వెబ్ సైట్ లో లిస్టెడ్ అయినా 3 పోస్టింగ్ కంపెనీస్.
siteground
bluehost
dreamhost
నేను ఒక సంవత్సరం పాటు ఆల్రెడీ siteground నా బ్లాగ్ కి ఉపయోగించాను.
siteground :-
సైట్ గ్రౌండ్ లో నాకు బాగా నచ్చేది ఇంటర్ఫేస్. క్లీన్ ui ఉంటుంది, ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మీకు ఈజీగా అర్థమవుతుంది.
siteground ఇప్పటికే 20 లక్షల వెబ్ సైట్స్ కి హోస్టింగ్ సర్వీసెస్ అందిస్తుంది.
కస్టమర్ సపోర్ట్ సైడ్ గ్రౌండ్ లో చాలా బాగుంటుంది.
siteground గురించి మరింత వివరంగా నా ఎక్స్పీరియన్స్ కూడా కలిపి నెక్స్ట్ ఆర్టికల్ లో రాస్తాను.
Siteground లో prices ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Bluehost:-
Bluehost కూడా అఫీషియల్గా ప్రెస్ రికమెండ్ చేస్తున్న హోస్టింగ్ ప్రొవైడర్.
ఈ హోస్టింగ్ లో ఒక .com డొమైన్ సంవత్సరం పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు.
బ్లూస్ లో అప్ టైం ,కస్టమర్ సపోర్ట్ కూడా బావుంటుంది.
పెద్ద blogger ఎక్కువగా రికమండ్ చేసే hostings లో ఇది కూడా ఒకటి.
చివరిగా కంక్లూషన్, హోస్టింగ్ కొనే ముందు చూడాల్సినవి మంచి price లో వస్తుందా లేదా? అలాగే మంచి కస్టమర్ సపోర్ట్ ఇస్తున్నారా? సర్వర్ uptime ఎంత ఉంది? పైన చెప్పిన అన్ని చూసి ఒక మంచి హోస్టింగ్ తీసుకోండి.
మీ వెబ్సైటు స్పీడ్ మీరు తీసుకునే హోస్టింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీకు ఇంకా హోస్టింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే admin@bloggingbadi.com కి మెయిల్ చేయండి.
Note :- కాబట్టి కొంచెం price ఎక్కువ ఉన్నా సరే మంచి హోస్టింగ్ ప్రొవైడర్ ని ఎంచుకోవడం చాలా ఉత్తమము.
Check out the new detailed article on Domain name selection guide in Telugu
నా పేరు క్రాంతి కుమార్. నేను బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ తో bloggingbadi.com వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఈ బ్లాగ్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్, స్టార్టుప్ &
ఎఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Domain in Telugu:- డొమైన్ నేమ్ అంటే ఏమిటి? మనమందరం ఇంటర్నెట్ లో మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం వెతికే ఉంటాం. ఐతే మనకి సమాచారం అందించే బ్లాగ్స్ లేదా వెబ్సైటు కి …
బ్లాగింగ్ అంటే ఏమిటి? what is blogging in Telugu? and some popular telugu blogs. బ్లాగింగ్ అంటే మనకు తెలిసినా సమాచారం లేక మనకి ఆశక్తి ఉన్న వాటిగురించి ఇంటర్నెట్ …
Gud info
Hello meru chala baga web hosting kosam artical rasaru naku kuda oka telugu blogging run cheyalali ani vundi but I don’t have guidance please help me
Tappa Kunda chestha sister…Bloggingbadi facebook page ki msg cheyandi.
Sir,
I want to write story in the blog, is it possible or any other sites are available.
Please let me know.
Regards
Sujatha
give me some more information aboyt hosting and blogging…why because iam also trying start a blog