హోస్టింగ్ రెన్యువల్ చేసుకోకపోతే ఏం అవుతుంది ?
బ్లాగ్ స్టార్ట్ చేయాలి అంటే Domain మరియు Hosting కావాలి. బ్లాగింగ్ చేసేవారికి తెలిసిన విషయమే ఇది. కానీ, హోస్టింగ్ ప్లాన్ expire అయ్యే టైం కి ఏం చేయాలి?
అలాగే చాలామంది లో ఉండే డౌట్స్ కొన్ని ఈ ఆర్టికల్ లో మీతో పంచుకుంటాను.
నేను నా హోస్టింగ్ అకౌంట్ రెన్యువల్ చేసుకోకపోతే నా డేటా మరియు ఫైల్స్ పోతాయా?
అవును, మీ హోస్టింగ్ ప్లాన్ ముగుస్తుంది అనేగా మీ Gmail కి రెన్యూ చేస్కోండి అని మెయిల్స్ వస్తూనే ఉంటాయి.
అయ్యిన మనం ఏమి పట్టనట్టు ఉంటే మన ప్లాన్ అయిపోయిన 7-10 రోజులలో లో అకౌంట్ టెర్మినేట్ అవుతుంది. ఈ వారం రోజుల గడువులో మనం మన ఫైల్స్ backup తీస్కోవచ్చు.
హోస్టింగ్ expire అయ్యాక నా బ్లాగ్ access అవుతుందా?
మీ బ్లాగ్ access అవ్వదు. హోస్టింగ్ కంపెనీస్ అన్ని ఇలాగే ఉంటాయి. మీ ప్లాన్ expire అయ్యిన తరవాత ఒక్క రోజు కూడా మీ బ్లాగ్ పోస్ట్స్ మరియు లింక్స్ ఏమి access అవ్వవు.
కానీ 7 రోజులు టైం లో మీకు రెన్యూ చేస్కునే అవకాశం ఉంటది. మీరు కనుక ఈ వారం వ్యవధిలో రెన్యూ చేసుకుంటే మీ బ్లాగ్ యధావిధిగా రన్ అవుతుంది.
మేము ఇప్పుడు రెన్యూ చేసుకోలేము కానీ మా బ్లాగ్ యాక్టీవ్ గా ఉండాలి అనుకుంటున్నాం ఏం చేయాలి?
సైట్ మైగ్రేషన్ లేదా సైట్ ట్రాన్స్ఫర్ అనే ఫీచర్స్ ఉంటాయి. మన ఫైల్స్ అన్ని వేరే హోస్టింగ్ సర్వర్ కి మైగ్రేట్ చేస్కోవచ్చు.
మీకు గనుక బ్లాగర్ ఫ్రెండ్ ఉండి వాళ్లకి ఒకటి కంటే ఎక్కువ బ్లాగ్స్ మైంటైన్ చేసే హోస్టింగ్ ప్లాన్ ఉంటే మీ బ్లాగ్ ని తన హోస్టింగ్ కి మైగ్రేట్ చేస్కోవచ్చు.
అన్ని కంపెనీస్ ఫ్రీ మైగ్రేషన్ ఇవ్వవు, అది మీరు తీసుకున్న హోస్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీస్ మాత్రమే ఫ్రీ ఇస్తాయి.
రెన్యువల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఏం చేయాలి?
మాములుగా మనం హోస్టింగ్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ లో 3 సంవత్సరాలు తీసుకుంటే మళ్లీ తరవాత రెన్యువల్ కి అదే price కి ఆఫర్ లో వస్తుంది. అందుకే ఫుల్ టైం బ్లాగర్స్ ఎక్కువ longterm హోస్టింగ్ ప్లన్స్ తీసుకుంటారు.
ఐతే చాలా మంది బ్లాగింగ్ ప్రపంచం ఎలావుంటదో చూదాం అని 1 సంవత్సరం ప్లాన్(Startup plan) తీసుకుంటారు.
ఇలాంటి వాళ్లకి రెన్యువల్ లో హోస్టింగ్ కంపెనీ చుక్కలు చూపించే రెన్యువల్ అమౌంట్ చూపిస్తుంది (Siteground $180).
ఐతే ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి చేస్కోవడం కంటే ఇంకొక హోస్టింగ్ ప్రొవైడర్ కి మారిపోవడం మంచిది. హోస్టింగ్ ఎలా చేంజ్ చేయాలి అని నెక్స్ట్ ఆర్టికల్ డిటైల్డ్ గా రాస్తాను.
ఇప్పుడు ఆపేసి మళ్లీ కొంత కాలం తరవాత బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను రెన్యూ చేయాలా?
అది మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కొంత మంది ప్రస్తుతానికి బ్లాగింగ్ వదిలేసి తరవాత చూదాం అనే ఆలోచనలో ఉన్నారు.
ఐతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక్కటే, మీరు మీ బ్లాగ్ రన్నింగ్ లో ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండ హోస్టింగ్ రెన్యూ చేయించుకోవాలి.
కాదు మేము తరవాత చూస్తాం, బ్లాగ్ visible గా ఉండాల్సిన పని లేదు అని అనుకుంటే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటారో అప్పుడు మళ్లీ కొత్త హోస్టింగ్ ప్లాన్ తీసుకోవలసి ఉంటుంది.
హోస్టింగ్ రెన్యూ చేసుకోకపోతే జరిగేవి ఇవే:
1. మీ బ్లాగ్ ఇంటర్నెట్ లో కనిపించడం ఆగిపోతుంది. మీరు సోషల్ మీడియా లో షేర్ చేసిన ఆర్టికల్ లింక్ ద్వారా వచ్చే ట్రాఫిక్ కి మీ బ్లాగ్ లేదు 404 Error అని కనిపిస్తుంది.
2. మీ హోస్టింగ్ expire అవుతుంది కాబ్బటి గూగుల్ సెర్చ్ లో కనిపించదు. దాని వాళ్ళ మీ SEO rank పడిపోతుంది.
3. బ్లాగ్ పోస్ట్స్ డేటా మొత్తం హోస్టింగ్ సర్వర్ నుండి తీసేస్తారు. అలాగే మీ website కి డాటాబేస్స్ ఉంటే అవి కూడా పూర్తిగా పోతాయి.
Nice work on telugu blogging.
super brother